https://oktelugu.com/

Chandrababu And Pawan: ఎట్టకేలకు దక్షిణాదికి గుర్తింపు.. తెర వెనుక చంద్రబాబు, పవన్

దేశంలో దక్షిణాది రాష్ట్రాలపై ఒక రకమైన వివక్ష ఉండేది. కానీ క్రమేపి సీన్ మారుతోంది. దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం లేకుండా జాతీయ రాజకీయాలు ముందుకు సాగడం లేదు. దీంతో సౌత్ ఇండియా కు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి కేంద్రానికి ఏర్పడుతోంది.

Written By:
  • Dharma
  • , Updated On : November 19, 2024 / 11:25 AM IST

    Chandrababu- Pawan Kalyan

    Follow us on

    Chandrababu And Pawan: కేంద్రం విషయంలో చంద్రబాబులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతం మాదిరిగా ఆయన వ్యవహరించడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. ఆపై ఆ పార్టీ మద్దతు కీలకము కూడా. అయినా సరే చంద్రబాబు అతిగా వ్యవహరించడం లేదు. కాస్త తగ్గి ముందుకు సాగుతున్నారు. కూటమిలో తాము కీలకం అన్న విషయాన్ని అంతర్గతంగానే ఉంచుకుంటున్నారు. ఎక్కడా మోడీకి గుర్తు చేయడం లేదు. చిన్న హెచ్చరిక చేసేందుకు కూడా సిద్ధపడటం లేదు. మరో కీలక పార్టీ నేత నితీష్ కుమార్ మాత్రం అప్పుడప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. కానీ చంద్రబాబు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ కూటమికి దూరమయ్యేది లేదంటున్నారు. మంచిగా ఉంటూనే రాష్ట్ర ప్రయోజనాలు సింహభాగం పొందాలని చూస్తున్నారు.బెదిరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని గత అనుభవాలను గుర్తు చేస్తున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాలకు మంచి ప్రాధాన్యం దక్కుతోంది కేంద్రంలో.

    * తెలుగు అధికారులకు నో ఛాన్స్
    గతంలో కేంద్ర ప్రభుత్వంలో తెలుగు అధికారులకు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. కానీ ఈసారి తెలుగు అధికారులకు కీలక బాధ్యతలు అప్పగిస్తోంది కేంద్రం. తాజాగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా తెలుగు అధికారి సంజయ్ మూర్తి నియమితులయ్యారు. అయితే అది బ్యూరోక్రసీ వ్యవస్థలో ఆశ్చర్యం రేపుతోంది. సాధారణంగా అయితే ఈ పదవిని బిజెపి పెద్దలు అత్యంత సన్నిహితులకి ఇస్తారు. ప్రస్తుతం పదవీ విరమణ చేస్తున్న ముర్ము జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా చేశారు. అయినా కాగ్ గా నియమించారు. ఇప్పుడు అదే పదవిలో తెలుగు అధికారిని నియమించారు. ఆయన బ్యాక్ గ్రౌండ్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన నియామకం విషయంలో చంద్రబాబు చక్రం తిప్పినట్లు సమాచారం.

    * మారిన పరిస్థితులకు అనుగుణంగా
    బిజెపి అధికారంలోకి వచ్చి పదేళ్లు అవుతోంది. ఆ పార్టీ నేతృత్వంలోని నడుస్తున్న ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చింది. కానీ గత రెండుసార్లు దక్షిణాది రాష్ట్రాలకు పెద్దగా ప్రాధాన్యం దక్కేది కాదు. ఇప్పుడు మాత్రం చంద్రబాబుతో పాటు పవన్ కీలకంగా మారారు. దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి కేంద్రానిది. అందుకే ఇప్పుడు కేంద్ర నియామకాల్లో సైతం తెలుగు రాష్ట్రాలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే గతంలో లేని సంస్కృతిని తేవడం వెనుక చంద్రబాబు కృషి ఉందన్నమాట.