https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ఓటింగ్ లో పడిపోయిన నిఖిల్ గ్రాఫ్..నెంబర్ 1 స్థానంలో నభీల్..డేంజర్ జోన్ లో ఆడపులులు!

నేడు కూడా టీవీ టెలికాస్ట్ లో కొనసాగుతుంది కాబట్టి, ఓటింగ్ లైన్స్ అధికారికంగా ఇంకా ఓపెన్ కాలేదు. కానీ నామినేషన్స్ లోకి వచ్చిన 5 మందిని పోలింగ్ లో పెడుతూ, సోషల్ మీడియా లో పెట్టిన పోల్స్ లో ఎవరెవరు ఏ స్థానం లో ఉన్నారో ఇప్పుడు వివరంగా చూడబోతున్నాము.

Written By:
  • Vicky
  • , Updated On : November 19, 2024 / 11:21 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8 : ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ఎంత బిన్నంగా జరిగిందో మనమంతా చూసే ఉంటాము. ఆడియన్స్ కి చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ అని అనిపించింది మాత్రం నిన్నటి ఎపిసోడ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పాత కంటెస్టెంట్స్ అందరూ ఒక్కొక్కరిగా హౌస్ లోపలకు అడుగుపెట్టి, టాప్ 10 కంటెస్టెంట్స్ లో యష్మీ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ మరియు నబీల్ ని నామినేట్ చేసి వెళ్లారు. నబీల్ కి పాజిటివ్ సలహాలు ఇస్తూ నామినేషన్స్ వేయగా, మిగిలిన కంటెస్టెంట్స్ అందరికీ నెగటివ్ పాయింట్స్ తో నామినేషన్స్ వేసి వెళ్లారు. అయితే ఈ ప్రక్రియ నేడు కూడా టీవీ టెలికాస్ట్ లో కొనసాగుతుంది కాబట్టి, ఓటింగ్ లైన్స్ అధికారికంగా ఇంకా ఓపెన్ కాలేదు. కానీ నామినేషన్స్ లోకి వచ్చిన 5 మందిని పోలింగ్ లో పెడుతూ, సోషల్ మీడియా లో పెట్టిన పోల్స్ లో ఎవరెవరు ఏ స్థానం లో ఉన్నారో ఇప్పుడు వివరంగా చూడబోతున్నాము.

    అందరికంటే ఎక్కువ ఓటింగ్ తో నబీల్ నెంబర్ 1 స్థానంలో దూసుకొని పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీల తర్వాత నబీల్ ఒక్కసారి కూడా నామినేషన్స్ లోకి రాలేదు. దీంతో అతని గ్రాఫ్ బాగా తగ్గిపోయి ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా భారీ మార్జిన్ తో నెంబర్ 1 స్థానంలో కొనసాగడం నిజంగా షాక్ కి గురి అవ్వాల్సిన విషయమే. ఇక రెండవ స్థానంలో నిఖిల్ కొనసాగుతున్నాడు. ఇతనికి పడినన్ని నెగటివ్ ఎపిసోడ్స్ ఇటీవల కాలంలో ఏ కంటెస్టెంట్ కి కూడా పడలేదు. కాబట్టి నిఖిల్ ఓటింగ్ గ్రాఫ్ తగ్గుతుంది అని అనుకోవడం సహజమే. కానీ నబీల్, నిఖిల్ కి మధ్య ఏకంగా 6 శాతం ఓటింగ్ తేడా ఉంటుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఇక నుండి నిఖిల్ కి పాజిటివ్ ఎపిసోడ్స్ పడకపోతే ఆయన టైటిల్ రేస్ నుండి తప్పుకునే అవకాశాలు కూడా లేకపోలేదు.

    వీళ్లిద్దరి తర్వాత ప్రేరణ, యష్మీ, పృథ్వీ ముగ్గురూ కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టే అని చెప్పొచ్చు. ప్రేరణ ఫ్యామిలీ ఆడియన్స్ లో చాలా బ్యాడ్ అయ్యింది. ఇది ఈమెకి తీవ్రమైన నెగటివ్ అవ్వొచ్చు. ఇప్పటికే ఓటింగ్ లో తేడా చాలానే కనిపిస్తుంది. ఈ వారం కూడా ఆమె నోరు కంట్రోల్ చేసుకోకపోతే ఎలిమినేట్ కూడా అయిపోవచ్చు. అదే విధంగా యష్మీ గేమ్ ని కూడా పాత కంటెస్టెంట్స్ హౌస్ లోపలకు వచ్చి బయట పెట్టి పోయారు. అది ఈమెకి చాలా నెగటివ్ అయ్యింది. ఓటింగ్ లో కూడా ఈమె అందరికంటే చివరి స్థానంలో ఉంది. ఇక పృథ్వీ విషయానికి వస్తే ఇతనికి సైలెంట్ ఓటింగ్ మామూలుగా లేదు. పైగా విష్ణు ప్రియ కూడా నామినేషన్స్ లో లేదు కాబట్టి ఆమెకు ఉన్న ఓటింగ్ కూడా పృథ్వీ కి పడొచ్చు. డేంజర్ జోన్ లో ఉన్నది మాత్రం యష్మీ, ప్రేరణనే. గత వారం ఎలిమినేషన్ లేదు కాబట్టి, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే వీళ్లిద్దరు ఎలిమినేట్ అవుతారని విశ్లేషకులు అంటున్నారు.