Duvvada Srinivasa Rao : కుటుంబ వివాదాల్లో చిక్కుకునే చాలామంది నేతలు తమ రాజకీయ జీవితాన్ని కోల్పోయారు. ప్రజల్లో చులకన అవుతారు. ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. గత ఐదు సంవత్సరాలుగా దువ్వాడ శ్రీనివాస్ చాలా దూకుడుగా ఉండేవారు. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతిలో ఓడిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా జగన్ ప్రభంజనం వీచినా.. శ్రీకాకుళం కు వచ్చేసరికి మాత్రం రామ్మోహన్ నాయుడు ముందు దువ్వాడ శ్రీనివాస్ నిలబడలేకపోయారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత వైఖరితోనే ఓడిపోయారని అప్పట్లో ప్రచారం జరిగింది. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో వైసిపి గెలిచినా.. దువ్వాడ ఓటమి వెనుక ఆయన దూకుడు కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే అదే దూకుడు జగన్ కు నచ్చింది. ఏకంగా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిని చేశారు. ఆపై ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చారు. మంత్రిగా కూడా అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. జగన్ ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడంతో రెచ్చిపోయారు దువ్వాడ. గత ఐదేళ్లలో చంద్రబాబు, పవన్, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. ముఖ్యంగా కింజరాపు కుటుంబాన్ని టార్గెట్ చేసుకున్నారు. వారిపై వ్యక్తిగత కామెంట్లకు సైతం దిగారు. అయితే వైసిపి ఘోర ఓటమితో సైలెంట్ అయ్యారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రాజకీయపరంగా ఇబ్బందుల్లో ఉండగా.. ఇప్పుడు కుటుంబ వివాదం సైతం రచ్చ రచ్చగా మారుతోంది. తన ఇద్దరు పిల్లలు సైతం విభేదించేదాకా పరిస్థితి వచ్చింది.
* తొలి అభ్యర్థిగా శ్రీనివాస్
రాష్ట్రంలో తొలిసారిగా దువ్వాడ శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు జగన్. టెక్కలి నియోజకవర్గంలో పోర్టు ప్రారంభోత్సవానికి వచ్చిన జగన్.. దువ్వాడ శ్రీనివాసును నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కోరడం ద్వారా అభ్యర్థిగా ఖరారు చేశారు. కానీ అక్కడకు నెల రోజులు దాటక మునుపే టెక్కలి అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి పేరును ప్రకటించారు. దువ్వాడ శ్రీనివాసులు తప్పించి వాణి పేరును ఖరారు చేశారు. మహిళా సాధికారితకు ప్రాధాన్యం ఇస్తూ నాటి సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని దువ్వాడ శ్రీనివాస్ తో ప్రకటన కూడా ఇప్పించారు. దీనిపై దువ్వాడ వాణి మండిపడ్డారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి వస్తే దువ్వాడ ఖాళీ చేసిన ఎమ్మెల్సీ సీటును ఇస్తానని జగన్ హామీ ఇవ్వడంతో శాంతించారు.
* అనూహ్యంగా వాణి
అయితే దువ్వాడ వాణి పేరు ప్రకటన వెనుక కుటుంబ వివాదం అప్పట్లో బయటపడింది. కుటుంబంలో వివాదాలు నెలకొన్నాయని.. అందుకు ఒక మహిళ కారణమని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే దువ్వాడ వ్యవహార శైలి అలానే నడిచింది.కుటుంబమంతా ఒకచోట నివాసం ఉంటే.. ఆయన ఒంటరిగా మరోచోట నివాసం ఉండేవారు. ఓ మహిళతో సన్నిహిత సంబంధాల వల్లేఈ వివాదానికి కారణమని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అయితే జగన్ సముదాయించినా.. భార్య తరపు బంధువులు అంతా దువ్వాడకు వ్యతిరేకంగా పనిచేసినట్లు వార్తలు వచ్చాయి.
* ఇంటి వద్ద కుమార్తెల ఎదురుచూపు
దువ్వాడకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం జరిగింది. ఆమె భర్త తండ్రి ఇటీవల మృతి చెందాడు. కానీ దువ్వాడ కనీసం పరామర్శకు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఇద్దరు కుమార్తెలు దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. అప్పటికే దువ్వాడ ఇంట్లో ఉండగా.. లోపల నుంచి తాళాలు వేసి లేరని చెప్పడంతో చాలాసేపు వారు నిరీక్షించినట్లు సమాచారం. దీనిపై కుమార్తెలు ఇద్దరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ తండ్రి వేరే మహిళ ట్రాప్ లో పడి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More