Shraddha Dhawan Dairy Business: మల్లారెడ్డి సార్.. గా పొద్దు పాలమ్మిన.. పూలమ్మిన.. కష్టపడ్డ.. సక్సెస్ అయిన.. అని అన్నడు కదా.. అట్లనే ఈ అమ్మాయి కూడా సక్సెస్ అయింది.. తనతోటి వాళ్ళు చదువుల వెంట.. కార్పొరేట్ కంపెనీల వెంట పరుగులు తీస్తుంటే.. ఈమె మాత్రం గేదెలు.. పాలు.. నెయ్యి.. అంటూ సరికొత్త ప్రయోగాలు మొదలుపెట్టింది. ఇప్పుడు ఏకంగా చేయడానికి అంతకుమించి అనే స్థాయిలో సంపాదిస్తూ.. సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నది.
Also Read: చాణక్య నీతి ఈ నాలుగు అలవాట్ల కోసం ప్రయత్నించండి.. సక్సెస్ మీదే..
డబ్బు అనేది ఊరికే రాదు. బంగారం వ్యాపారం చేసే కిరణ్ కుమార్ చెప్పాడు గుర్తుంది కదా.. ఈమె కూడా అటువంటి పాఠాన్ని కంఠతా పాటించింది. తన తండ్రి వారసత్వంగా చేపడుతున్న క్షీర విక్రయాలను ఒక రేంజ్ లో విస్తరించింది. తద్వారా ఏడాదికి కోటి రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగింది.. ఈ ప్రస్థానంలో ఆమె ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదుర్కొంది. అనేక రకాలుగా ఇబ్బందులు పడింది. చివరికి విజయవంతమైంది.
మహారాష్ట్ర చెందిన శ్రద్ధ ధావన్ కు ఐదు సంవత్సరాలు. ఈమె స్వస్థలం నీగోజ్. ఈమె తండ్రికి పాల వ్యాపారం ఉండేది. పైగా గేదెల క్రయవిక్రయాలు జరిపేవాడు. శ్రద్ధకు 11 సంవత్సరాలు వయసు ఉన్నప్పటినుంచే తన తండ్రి వ్యాపారాన్ని గమనిస్తూ ఉండేది. తన తండ్రి పాలు సేకరిస్తున్న విధానాన్ని పరిశీలించేది. అలా ఆమెకు చిన్నప్పుడే పాలతో అనుబంధం ఏర్పడింది.. అలా ఆమెను వ్యాపారిగా మార్చింది. ఉన్నత చదువులు చదివినప్పటికీ.. ఆమె ఆలోచన మొత్తం పాల చుట్టూ, గేదెల చుట్టూ తిరిగింది. ఉన్నత ఉద్యోగాలు చేయాలని.. ఉన్నతంగా స్థిరపడాలని తన తండ్రి కోరినప్పటికీ ఆమె ఆ దిశగా ఆలోచించలేదు. పాల వ్యాపారం ఆమెకు పూల పాన్పు కాలేదు. ఇందులో అనేక కష్టాలు ఎదుర్కొంది. తీవ్ర ఇబ్బందులను చవిచూసింది. చివరికి విజయవంతమైంది. మొదట్లో ఆడపిల్లలు నీకు వ్యాపారం ఎందుకని చాలామంది ఆమెను చిన్న చూపు చూశారు. నీకు వ్యాపారం సరిపోదని గేలి చేశారు. ఇంకా రకరకాల మాటలు మాట్లాడి ఆమెను ఇబ్బంది పెట్టారు. ఇన్ని మాటలను ఆమె గెలుపు పాఠాలుగా మార్చుకుంది.
Also Read: నిర్మాణ రంగంలో ఇదో గేమ్ చేంజర్
మొదట్లో శ్రద్ధ తండ్రి వద్ద 22 గేదెలు ఉండేవి. వాటిని 80 కి పెంచుకుంది శ్రద్ధ. దీనికోసం బ్యాంకులో రుణం తీసుకుంది. ప్రస్తుతం ఆమె ఫామ్ లో ఉన్న గేదెల ద్వారా ప్రతిరోజు 350 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నది. కేవలం పాలు మాత్రమే కాదు, పన్నీర్, ఘీ కూడా అమ్ముతోంది. ఇవి మాత్రమే కాకుండా జీరో వేస్ట్ ఫాం ఏర్పాటుచేసి.. బయోగ్యాస్ ను ఉత్పత్తి చేస్తోంది.. తద్వారా ఏడాదికి కోటి రూపాయల దాకా సంపాదిస్తోంది. ప్రస్తుతం తన తోటి స్నేహితులు ఉద్యోగాలు కోల్పోయి.. ఇబ్బంది పడుతుంటే.. శ్రద్ధ మాత్రం పదిమందికి ఉపాధి చూపిస్తున్నది.. అంతేకాదు ఒక వ్యాపారిలాగా మారిపోయి తన కాళ్ళ మీద తాను నిలబడింది.