Trivikram And Allu Arjun: కల్కి ని మించిన కథ : త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమా షేక్ చేయబోతోందట.. ఆ విశేషాలివీ…

మహేష్ బాబుతో ఆయన చేసిన 'గుంటూరు కారం' సినిమా మాత్రం ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించలేదు. మరి ఎందుకు ఆ సినిమా విషయం లో త్రివిక్రమ్ అంత నిర్లక్ష్యం వహించాడు అంటూ కొంతమంది కామెంట్ చేస్తుంటే, మరి కొంతమంది మాత్రం త్రివిక్రమ్ ఈ సినిమా మీద తన పూర్తి ఎఫర్ట్ పెట్టాడు. కానీ ఈ సినిమా అనుకున్న రేంజ్ లో అయితే రాలేదు. అది మహేష్ బాబు ఇమేజ్ కి తగ్గ స్క్రిప్టు కాదు అంటూ కామెంట్లైతే చేస్తుంటారు.

Written By: Gopi, Updated On : July 17, 2024 10:01 am

Trivikram And Allu Arjun

Follow us on

Trivikram And Allu Arjun: సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది దర్శకులకు సెపరేట్ క్రేజ్ అయితే ఉంటుంది. ఆయన సినిమాలు అన్నీ రకాల ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తూ ఆదరిస్తూ అంటారు. అలాంటి డైరెక్టర్లలో త్రివిక్రమ్ ఒకరు. ఇక ఇప్పటి వరకు ఈయన డైరెక్షన్ లో వచ్చిన ప్రతి సినిమా కూడా ఒక డీసెంట్ హిట్ గా నిలిచింది… ఒకటి రెండు సినిమాలు ప్లాప్ అయినప్పటికీ ఆయన రైటర్ గా, డైరెక్టర్ గా మాత్రం ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఇక ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి చాలా మంచి ట్రాక్ రికార్డు అయితే ఉంది. ఆయన రైటర్ గా చేసిన సినిమాలు గాని, దర్శకత్వం వహించిన సినిమాలు గానీ అన్నీ కూడా మంచి విజయాలను సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించి పెట్టాయి.

మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేసిన ప్రతి సినిమా డైలాగ్స్ ప్రతి ప్రేక్షకుడు గుర్తు పెట్టుకుంటారనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ మహేష్ బాబుతో ఆయన చేసిన ‘గుంటూరు కారం’ సినిమా మాత్రం ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించలేదు. మరి ఎందుకు ఆ సినిమా విషయం లో త్రివిక్రమ్ అంత నిర్లక్ష్యం వహించాడు అంటూ కొంతమంది కామెంట్ చేస్తుంటే, మరి కొంతమంది మాత్రం త్రివిక్రమ్ ఈ సినిమా మీద తన పూర్తి ఎఫర్ట్ పెట్టాడు. కానీ ఈ సినిమా అనుకున్న రేంజ్ లో అయితే రాలేదు. అది మహేష్ బాబు ఇమేజ్ కి తగ్గ స్క్రిప్టు కాదు అంటూ కామెంట్లైతే చేస్తుంటారు. ఇక మొత్తానికైతే త్రివిక్రమ్ లాంటి దర్శకుడు నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఇప్పటికి కూడా ఆ సినిమా కోసం విపరీతంగా ఎదురుచూసే అభిమానులనైతే ఆయన సంపాదించుకున్నాడు.

ఇక మొత్తానికైతే ఆయన ఇప్పుడు ఒక పాన్ ఇండియా సబ్జెక్ట్ ని డీల్ చేసే క్రమంలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. అందులో భాగంగానే అల్లు అర్జున్ తో ఒక సినిమా ఉంటుందని త్రివిక్రమ్ ఇంతకు ముందే అనౌన్స్ చేశాడు. ఇక ఇప్పుడు ఆ సినిమా మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంక దీనికి అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా ఉంటుందా ఉండదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఫైనల్ గా అల్లు అర్జున్ త్రివిక్రమ్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా సబ్జెక్టుతో రావడమే కాకుండా ఒక పీరియాడికల్ డ్రామా మూవీగా కూడా తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా భారీ బడ్జెట్ తో వచ్చి భారీ కలెక్షన్లను కొల్లగొడుతుంది.

ఇక ఈ సినిమాను మించిన కథతో త్రివిక్రమ్ ఇప్పుడు అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ గా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు ఉంటారా? లేదంటే వేరే వాళ్ళు ఉంటారా? అనే విషయాల పట్ల ఇంకా సరైన క్లారిటీ అయితే రాలేదు. ఇక మొత్తానికైతే త్రివిక్రమ్ కూడా ఇప్పుడు వస్తున్న యంగ్ డైరెక్టర్స్ మాదిరిగానే తను కూడా పాన్ ఇండియా సబ్జెక్ట్ లతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే సీనియర్ డైరెక్టర్లలో రాజమౌళి, సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్లు పాన్ ఇండియా సబ్జెక్టులను ఎంచుకొని పాన్ ఇండియాలో తమ సత్తా చాటుతున్నారు. ఇక ఇప్పటివరకు త్రివిక్రమ్ ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు. ఇక ఇప్పుడైనా ఆయన భారీ పాన్ ఇండియా సబ్జెక్టుని చేసి సూపర్ సక్సెస్ ను కొట్టాలని కోరుకుందాం…