Electricity Smart Meters: ఏపీ వ్యాప్తంగా విద్యుత్ స్మార్ట్ మీటర్ల( smart metres) బిగింపు ప్రక్రియ ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా స్మార్ట్ మీటర్లను బిగించారు. మిగతా చోట్ల సైతం విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా సంఘాలు విద్యుత్ స్మార్ట్ మీటర్ల పై ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధపడుతున్నాయి. అందుకు సంబంధించి కార్యాచరణను రూపొందిస్తున్నాయి. ప్రజా సంఘాలను ఏకతాటి పైకి తీసుకొచ్చి పోరాటం చేయాలని నిర్ణయించాయి. ఈ స్మార్ట్ మీటర్ల బిగింపు అనేది కంపెనీకి మేలు చేసేందుకేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Also Read: పవన్ కళ్యాణ్ పై పుసుక్కున అంత మాట అనేశావేంటి షర్మిలక్కా
స్మార్ట్ మీటర్ల బిగింపు..
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు అమర్చారు. వ్యవసాయ కనెక్షన్లకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. వాణిజ్య సంస్థలు, పరిశ్రమలకు మాత్రం స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తోంది. వాస్తవానికి నెలకు 2 యూనిట్లకు పైగా విద్యుత్ వాడే వారికి స్మార్ట్ మీటర్లు బిగిస్తారని వార్తలు వచ్చాయి. కానీ అటువంటిదేమీ లేదని విద్యుత్ శాఖ చెబుతోంది. స్మార్ట్ మీటర్ల ద్వారా కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని విమర్శలు, ఫిర్యాదులు సైతం వస్తున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. అందుకే ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేవలం అదానికి మేలు చేసే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాయి.
Also Read: 60 లక్షల ఇన్సూరెన్సులు చేసి అత్తను చంపేశాడు.. ఏం స్కెచ్ రా సామీ
వైసిపి హయాంలో నిర్ణయం..
వాస్తవానికి వైసీపీ( YSR Congress ) హయాంలోనే స్మార్ట్ మీటర్ల ఏర్పాటు దిశగా అడుగులు పడ్డాయి. ముందుగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించడంతో రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంది. అయితే పట్టణ ప్రాంతాల్లో పారిశ్రామిక సంస్థలకు, వాణిజ్య అవసరాలకు సంబంధించి విద్యుత్ కనెక్షన్ కు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బిగింపు ప్రక్రియ కూడా ప్రారంభం అయింది. ఇతర విద్యుత్ కనెక్షన్లకు విస్తరించాలన్న ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అందుకే ప్రజా సంఘాలు ఏకతాటి పైకి వచ్చి ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమ బాట పట్టాయి . చూడాలి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో..