Siddipet: సిద్దిపేట జిల్లా తోగుట మండలం తుక్కపూర్ దర్గా దగ్గర ఇన్సూరెన్సు డబ్బుల కోసం అత్తను చంపించాడు అల్లుడు. పక్కా ప్లాన్ ప్రకారం అత్తను చంపిన అల్లుడు గుర్తు తెలియని వాహనం ఢీకొని చనిపోయిందంటు ప్రచారం చేశాడు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా కేసు దర్యప్తు చేపట్టిన పోలీసులు అల్లుడిని అదుపులోకి తీసుకున్నారు. పోస్టాఫీసు ఇన్యూరెన్సు, ఎస్బీఐ ఇన్సూరెన్సు, రైతు బీమా చేయించినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. నిందితులు పొలం పని ఉందని చెప్పి తీసుకెళ్లి.. అల్లుడు తమ్ముడి వాహనంతో ఢీకొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు.
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్తను చంపించిన అల్లుడు.. సిద్ధిపేట జిల్లాలో దారుణ ఘటన
తమ్ముడితో కలిసి అత్తను హత్య చేసిన నిందితుడు.
అత్త రామమ్మ పేరుపై ఎస్బీఐ, పోస్టాఫీసులో రూ.60 లక్షల ఇన్సూరెన్స్ పాలసీలు చేయించిన అల్లుడు.
పౌల్ట్రీ ఫామ్ పెట్టి రూ.22 లక్షలు నష్టపోయిన నిందితుడు.… pic.twitter.com/iI1xhPipxF— ChotaNews App (@ChotaNewsApp) July 12, 2025