Dussehra holidays in AP : ఏపీలో దసరా సెలవులు పై ఫుల్ క్లారిటీ వచ్చింది. ప్రభుత్వం ఇవాళ ప్రకటన చేసింది. ఇప్పటివరకు దసరా సెలవులు విషయంలో అస్పష్టత కొనసాగుతూ వచ్చింది. అక్కడ మీకు క్యాలెండర్ ప్రకారం దసరా సెలవులపై అనేక ఊహాగానాలు వచ్చాయి. వాటిని తెరదించుతూ పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విద్యార్థులకు రెండు సెలవు దినాలతో పాటు.. మొత్తం 12 రోజుల పాటు దసరా సెలవులు రాబోతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 12న విజయదశమి. అయితే రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు ఈ నెల మూడు నుంచి 12 వరకు దసరా సెలవులను ప్రకటించారు.రేపు గాంధీ జయంతి కావడంతో ఎలాగో సెలవు ఉంటుంది. అలాగే 13వ తేదీ ఆదివారం వచ్చింది. ఈ రెండు ప్రత్యేక సెలవు దినాలను కలుపుకొని మొత్తం 12 రోజులు పాటు సెలవులు ఇచ్చినట్లు అవుతుంది. దసరా తరువాత అక్టోబర్ 14న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి.
* ఉత్తర్వులు జారీ
పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు పేరుతో ఈరోజు ఉత్తర్వులు వెలువడ్డాయి. వివిధ ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈనెల 3 నుంచి 13 వరకు దసరా సెలవులు ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దసరా సెలవుల వివరాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు తమ పరిధిలోని అన్ని స్కూళ్లకు పంపాలని ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రాథమిక, మాధ్యమిక,ఉన్నత, జడ్పీ, ఎయిడెడ్, ప్రైవేట్ అండ్ స్కూల్స్ కు ఈ ఆదేశాలు వర్తించనున్నాయి.
* ప్రత్యేకంగా ప్లాన్
దసరా సెలవులు పై ఫుల్ క్లారిటీ రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక ప్లాన్ చేసుకుంటున్నారు. దైవదర్శనాలతో పాటు బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.అయితే దసరా శరన్నవరాత్రులు ఏపీ కంటే తెలంగాణలో కీలకం. అయితే ఏపీలో వరుసగా 12 రోజులు పాటు దసరా సెలవులు ఇవ్వడం విశేషం. గతంలో సంక్రాంతికి ఎక్కువగా సెలవులు ఉండేవి.దసరాకు పరిమిత రోజుల్లోనే సెలవులు ప్రకటించేవారు.కానీ ఈసారి గాంధీ జయంతి,ఆదివారం సెలవు కలిసి రావడంతో.. గరిష్టంగా 12 రోజులు పాటు సెలవులు దక్కాయి.