Tirumala Laddu issue : లడ్డు వివాదంలో సంచలనం.. చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిందే!

నిన్నటి వరకు వైసిపి కార్నర్ అయింది.సుప్రీంకోర్టు స్పందనతో సీన్ రివర్స్ అయింది. చంద్రబాబుదే తప్పు అన్నట్టు పరిస్థితి మారింది. దీంతో సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తుతోంది.

Written By: Dharma, Updated On : October 1, 2024 3:57 pm

Tirumala Laddu issue

Follow us on

Tirumala Laddu issue :  తిరుమలలో వ్యవహారంలో కిం కర్తవ్యం ఏంటి?దీనిపై చంద్రబాబు ఎలా వ్యవహరిస్తారు? సుప్రీంకోర్టు స్పందన నేపథ్యంలో రకరకాల విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసిపి హయాంలో టీటీడీ లడ్డూను కూడా కలుషితం చేశారని ఆరోపణలు చేశారు. లడ్డు తయారీకి సంబంధించి నెయ్యిలో జంతు కొవ్వు కూడా కలిపారని సంచలన ప్రకటన చేశారు. గుజరాత్ కు చెందిన ఎన్డిడిబి ల్యాబ్ నిర్ధారించిందని కూడా చెప్పుకొచ్చారు. అప్పటినుంచి తిరుమల లడ్డుపై ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఈ ప్రకటన ఉంది.అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే దీనిని సిబిఐకి అప్పగించాలని కోరుతూ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి, బిజెపి మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. నిన్ననే ఇది విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో వ్యాఖ్యానాలు చేసింది. కోట్లాదిమంది భక్తులతో ముడిపడిన అంశాన్ని బహిరంగంగా ఎలా వ్యక్తం చేస్తారని ప్రశ్నించింది. సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని తప్పు పట్టింది.రాజకీయాలకు, మతానికి మధ్య ఉండాల్సిన దూరాన్ని కూడా సుప్రీంకోర్టు గుర్తుచేసింది. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో చేప నూనె, జంతువుల కొవ్వు, పంది కొవ్వు ఉన్నట్టు గుజరాత్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టును సీఎం చంద్రబాబు విడుదల చేసిన సమయాన్ని కూడా తప్పు పట్టింది. లడ్డు వివాదం గురించి చంద్రబాబు మీడియాను ఆశ్రయించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించాలని కూడా ప్రభుత్వాన్ని నిలదీసింది. సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదని కూడా ప్రశ్నించింది.

* చంద్రబాబు తొందర పడ్డారా
అయితే నిన్న సుప్రీంకోర్టు స్పందన చూస్తే చంద్రబాబు తొందరపడి వ్యాఖ్యలు చేసినట్లు అయిందని తేలింది. దీంతో సోషల్ మీడియాలో చంద్రబాబుకు వ్యతిరేకంగా పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. హిందువుల మనోభావాలతో ఆడుకున్న చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.ఈ క్రమంలోనే వైసిపి అనుకూల మీడియా సైతం ప్రత్యేక కథనాలను ప్రచురిస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్ చంద్రబాబు కుట్రగా అభివర్ణిస్తోంది.

* వైసీపీ శ్రేణుల్లో జోరు
చంద్రబాబు టీటీడీ లడ్డు వ్యవహారం బయట పడిన తరువాత వైసిపి స్పందించింది. ఇదంతా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ గా అభివర్ణించింది.జగన్ సైతం ఇదే స్టాండ్ తో విమర్శలు చేశారు. ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టు తప్పు పట్టడంతో వైసీపీ శ్రేణులు చంద్రబాబును టార్గెట్ చేసుకుంటున్నాయి. విశ్లేషకులు సైతం చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యారని చెబుతున్నారు. మొత్తానికైతే తిరుపతి లడ్డు వ్యవహారం వైసీపీ మెడకు చుట్టాలన్న చంద్రబాబు ప్రయత్నం రివర్స్ అయినట్లు అయింది.దీనిపై ఏకంగా ఆయనే క్షమాపణలు చెప్పాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది.