https://oktelugu.com/

Dil Raju: ‘గేమ్ చేంజర్’ విషయంలో నిండా మునిగిపోయిన నిర్మాత దిల్ రాజు..శంకర్ ఆలస్యం కారణంగా ఎన్ని వందల కోట్లు వడ్డీ కట్టాడో తెలుసా?

బ్రాండ్ ఇమేజి ఉన్న నిర్మాత రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్, శంకర్ లాంటి డైరెక్టర్ తో కలిసి సినిమా చేస్తున్నాడు అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని ఎక్కడా తగ్గకుండా నిర్మించాడు దిల్ రాజు. అయితే దిల్ రాజు తన కెరీర్ లో ఎంత పెద్ద హీరోతో సినిమా తీసిన తాను అనుకున్న బడ్జెట్ లోనే పూర్తి చేస్తాడు.

Written By:
  • Vicky
  • , Updated On : October 1, 2024 / 04:00 PM IST

    DIl Raju

    Follow us on

    Dil Raju: పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ తో సినిమాలు తియ్యడం అంటే చిన్న విషయం కాదు. సినిమా నిర్మాణ దశలో ఉండగానే బిజినెస్ మొదలై టేబుల్ ప్రాఫిట్స్ వచ్చేస్తాయి కానీ, ఆ సినిమా మొదలై, షూటింగ్ పూర్తి అయ్యేంత వరకు నిర్మాతలు అనేక అగ్నిపరీక్షలు ఎదురుకోవాలి. ఇండస్ట్రీ లో పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నిర్మాతలు పాన్ ఇండియన్ హీరోలను తట్టుకోగలరు కానీ, అప్పుడే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొత్త నిర్మాతలు మాత్రం పాన్ ఇండియన్ హీరోలతో సినిమాలు తీసి, సరిగా మ్యానేజ్ చేసుకోలేకపోతే సూపర్ హిట్ అయ్యినప్పటికీ లాభాలను చూడలేని పరిస్థితి నెలకొంటుంది. గతం లో చాలామంది కొత్త నిర్మాతలు ఇలాగే కనుమరుగు అయిపోయారు. ఇదంతా పక్కన పెడితే ఇండస్ట్రీ లో దిల్ రాజు కి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈయన బ్యానర్ లో ఒక సినిమా తెరకెక్కుతుందంటే హీరో ఎవరు?, డైరెక్టర్ ఎవరు? అనేది ఆలోచించరు. అన్ని ప్రాంతాలకు చెందిన డిస్ట్రిబ్యూటర్స్ హక్కుల కోసం అడ్వాన్స్ పట్టుకొని ఆయన ముందు ఉంటారు.

    అలాంటి బ్రాండ్ ఇమేజి ఉన్న నిర్మాత రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్, శంకర్ లాంటి డైరెక్టర్ తో కలిసి సినిమా చేస్తున్నాడు అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని ఎక్కడా తగ్గకుండా నిర్మించాడు దిల్ రాజు. అయితే దిల్ రాజు తన కెరీర్ లో ఎంత పెద్ద హీరోతో సినిమా తీసిన తాను అనుకున్న బడ్జెట్ లోనే పూర్తి చేస్తాడు. భారీ బడ్జెట్ తో ఆయన సినిమాలు తీయడం ఇప్పటి వరకు జరగలేదు. కానీ ‘గేమ్ చేంజర్’ విషయంలో జరిగింది. ఈ సినిమా కోసం దిల్ రాజు దాదాపుగా 250 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ని ఖర్చు చేసాడు. హీరో రామ్ చరణ్ ఈ సినిమాలో నటించినందుకు గాను 100 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. షూటింగ్ ప్రారంభంలో వేగంగానే జరిగింది. కానీ శంకర్ కి మధ్యలో తప్పనిసరిగా ఇండియన్ 2 చిత్రాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత పడింది.

    దీంతో నెల రోజుల్లో 15 రోజులు ఆయన ‘ఇండియన్ 2’ చిత్రానికి డేట్స్ కేటాయిస్తే, మరో 15 రోజులు ‘గేమ్ చేంజర్’ చిత్రం కోసం కేటాయించేవాడు. ఒక్కోసారి గేమ్ చేంజర్ షూటింగ్ వాయిదా కూడా పడుతుండేది. ఆ సమయంలో నిర్మాత దిల్ రాజు పాపం ఫైనాన్షియర్స్ కి వడ్డీలు కట్టుకోలేక నరకం అనుభవించాడట. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయ్యే సమయానికి దిల్ రాజు తన ఫైనాన్షియర్స్ కి దాదాపుగా 350 కోట్ల రూపాయిలు వడ్డీలు కట్టుకున్నట్టు తెలుస్తుంది. సినిమాకి కేటాయించిన బడ్జెట్ కంటే, ఆయన కట్టుకున్న వడ్డిలే ఎక్కువ ఉన్నాయి. దీంతో దిల్ రాజు భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ చిత్రాన్ని బుద్దుంటే మళ్ళీ నిర్మించకూడదు అని నిర్ణయం తీసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసలు.