Janasena Glass Symbol : జనసేన గుర్తు విషయంలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న వివాదానికి తెరపడింది. ముందు మీ పార్టీ గుర్తును కాపాడుకోండి అంటూ విపక్షాలు జనసేనపై చేసిన విమర్శలకు రాష్ట్ర ఎన్నికల సంఘం చెక్ చెప్పింది. జనసేన పార్టీకి గాజుగ్లాస్ గుర్తును రిజర్వ్ చేసింది. రాష్ట్ర పార్టీగా గుర్తింపు లభించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి కామన్ సింబల్ గా గాజుగ్లాస్ గుర్తును కేటాయించనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించినందును.. తప్పకుండా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తిస్తుంది. ఇది చిన్నపాటి టెక్నికల్ ఇష్యూ. జనసేన అభ్యర్థులు ఎక్కడ నుంచి పోటీచేసినా వారికి ఇదే గుర్తును కేటాయిస్తారు. వచ్చే ఎన్నికల్లో కామన్ సింబల్ ఇవ్వనున్నారు.
అయితే గత ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీ పొందే ఓట్లు, సీట్లు రానందు వల్లే జాతీయ ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ కేటగిరిలో జనసేన గాజుగ్లాస్ గుర్తును చేర్చింది. కేవలం నిబంధనలను అనుసరించే అలా చేశారు. ఆ గుర్తును వేరే పార్టీలకు ఇచ్చే చాన్స్ లేదు. జనసేన రిక్వెస్ట్ ప్రకారం ఆ పార్టీ అభ్యర్థులందరికీ కామన్ సింబల్ గా గాజు గ్లాసును కేటాయిస్తారు. అయితే ఇది చిన్నపాటి ఇష్యూనే. జనసేనకు అదే గుర్తు కేటాయిస్తారని.. వారు అభ్యంతరం వ్యక్తం చేస్తే ఇండిపెండెంట్లకు ఆ సింబల్ ఇచ్చే చాన్సే లేదని అందరికీ తెలుసు. కానీ జనసేనను అబాసుపాలు చేసేందుకు అధికార వైసీపీ గుర్తుపై సోషల్ మీడియాలో లేనిపోని ప్రచారం చేస్తోంది.
రాష్ట్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తుపై స్పష్టతనిచ్చింది. రిజర్వ్ చేయడంతో అధికార వైసీపీ నోట్ల పచ్చి వెలక్కాయ పడినట్టయ్యింది. జనసేన గుర్తుపై దుష్ప్రచారానికి చెక్ చెప్పినట్టయ్యింది. రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తోంది. అటువంటిది రాష్ట్ర ప్రభుత్వమే ఏం చేయలేకపోయింది. అటువంటి జాతీయ ఎన్నికల సంఘం ఏం చేస్తుంది. వాస్తవానికి ఇటువంటి విషయాల్లో ఈసీ తెగేదాక లాగదు. పొలిటికల్ పార్టీలకు ఇబ్బందిపెట్టే నిర్ణయాలు తీసుకోదు. కానీ ఏపీలో జనసేన ప్రత్యర్థులు మాత్రం ఏదేదో జరిగిపోతుందని ఆశించారు. ఏమీ జరగకపోయేసరికి నీరసించిపోయారు.