Tollywood Drugs Case: పైకి కలర్ఫుల్ గా కనిపించే సినిమా పరిశ్రమ చీకటి బాగోతాలు చాలానే ఉన్నాయి. జూదం, వ్యభిచారం, డ్రగ్స్ వంటి అసాంఘిక చర్యలకు చిత్ర పరిశ్రమలు అడ్డాగా ఉన్నాయి. బాలీవుడ్ లో మొదలైన ఈ కల్చర్ మెల్లగా సౌత్ ఇండియాకు పాకింది. అవసరాల కోసమో, ఆనందం కోసమో తప్పుదారి పట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఫెయిల్యూర్ బ్యాచ్ ఇలాంటి క్రైమ్స్ కి పాల్పడతారు. సక్సెస్ ఫుల్ స్టార్స్ సుఖాల కోసం చేయకూడని పనులు చేస్తుంటారు. గత ఐదేళ్లుగా చిత్ర పరిశ్రమల్లో డ్రగ్ మాఫియా ఎక్కువైపోయింది.
చాలా కాలంగా డ్రగ్ కల్చర్ ఉన్నప్పటికీ ఈ మధ్య కొందరు ప్రముఖులు పట్టుబడడంతో పతాక శీర్షికలకు ఎక్కారు. కాగా ఈ డ్రగ్స్ ఆరోపణలు పలువురు హీరోయిన్స్ ఎదుర్కొన్నారు. వారిలో కొన్ని సంచలనం రేపిన కేసులు ఉన్నాయి. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు ప్రముఖ హీరోయిన్స్ ఎవరో చూద్దాం… 2018లో కాల్విన్ అనే డ్రగ్ పెడ్లర్ అరెస్ట్ అయ్యాడు. అతనితో పూరీ జగన్నాథ్, రవితేజ, తరుణ్, నవదీప్ వంటి స్టార్స్ తో సంబంధాలు ఉన్నాయని తెలిసింది.
ఈ కేసులో హీరోయిన్ ఛార్మి, ఐటమ్ బాంబ్ ఛార్మి కౌర్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. పలుమార్లు విచారణకు హాజరయ్యారు. కన్నడ పరిశ్రమను డ్రగ్స్ కేసు ఊపేసింది. ఈ కేసులో హీరోయిన్స్ సంజనా గల్రాని, రాగిణి ద్వివేది ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఏకంగా వీరిద్దరూ జైలు శిక్ష అనుభవించారు. రోజుల తరబడి వీరు జైల్లో ఉన్నారు. అనంతరం బెయిల్ పై బయటకు వచ్చారు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య సంఘటన బాలీవుడ్ లో ప్రకంపనలు రేపింది. ఈ కేసు విచారణ డ్రగ్ కేసుగా మలుపు తీసుకుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రేయసి రియా చక్రవర్తి, ఆమె తమ్ముడు షోవిక్ చక్రవర్తి అరెస్ట్ అయ్యారు. ఈ కేసు ఏకంగా దీపికా పదుకొనె వరకూ పాకింది. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న దీపికా ముంబై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణకు హాజరైంది. ఇదే కేసులో సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ విచారణ ఎదుర్కొన్నారు. టాలీవుడ్ డ్రగ్ కేసులో కూడా రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది.