Duvvada Srinivas: క్లైమాక్స్‌కు దువ్వాడ కుటుంబ కథా చిత్రం.. వాణి మూడు డిమాండ్లకు శ్రీనివాస్‌ ఓకే.. ఆ రెండింటి విషయంలో పీటముడి!

దాదాపు పది రోజులుగా ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వడ శ్రీనివాస్‌సరావు కుటుంబ కథా చిత్రం పలు మలుపులు తిరుగుతోంది. బార్య వాణి, స్నేహితురాలు మాధురి మధ్య నెలకొన్న వివాదం చినికి చినికి గాలివానలా మారింది.

Written By: Raj Shekar, Updated On : ఆగస్ట్ 14, 2024 3:09 సా.

Duvvada Srinivas(1)

Follow us on

Duvvada Srinivas: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ కుటుంబ గొడవలు రచ్చకెక్చాయి. ఈ గొడవలను అధికార ఎన్డీఏ కూటమి అనుకూల మీడియా కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా పండుగ చేసుకుంటోంది. చిలువలు పలువలుగా కుటుంబ గొడవలను ప్రజలపై రుద్దుతోంది. వ్యక్తిగత విషయాలపై చర్చలు పెట్టి మరింత పెద్దవి చేస్తోంది. ఈ క్రమంలో దువ్వాడ స్నేహితురాలు అయిన దివ్వెల మాధురి ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. ఇక దువ్వాడ భార్య వాణి ఐదు రోజులుగా ఆయన ఇంటి ఎదుట దీక్ష చేస్తోంది. ఈ రెండింటికీ కారణం మీడియానే. అయితే విషయం ఆలస్యంగా గుర్తించిన దువ్వాడ శ్రీనివాస్, వాణి కుటుంబ సభ్యులు ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చేందుకు రంగంలోకి దిగారు. ఇరు పక్షాల తరఫున మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. వాణి డిమాండ్లు తెలుసుకుని దువ్వాడకు చేరవేస్తున్నారు. మరోవైపు ఈ చర్చలకు మాధురి దూరంగా ఉన్నారు. తాను స్నేహితురాలినే అని మొదటి నుంచి చెబుతున్న ఆమె కుటుంబ విషయాల్లో తలదూర్చనని స్పష్టం చేశారు. దీంతో దువ్వాడ కుటుంబ కథా చిత్రం క్లైమాక్స్‌కు చేరుతున్నట్లు కనిపిస్తోంది.

వాణి 5 డిమాండ్లు.. మూడింటికి దువ్వాడ ఓకే..
ఇదిలా ఉంట.. వాణి, శ్రీనివాస్‌ దంపతుల మధ్య విభేదాలు తొలగించేందుకు చర్యలు చేపడుతున్న కుటుంబ సభ్యులు వాణి డిమాండ్లను తెలుసుకున్నారు. ఆమె ప్రధానంగా ఐదు డిమాండ్లు చేస్తున్నారు. వాటిని బంధువులు శ్రీనివాస్‌ దృష్టికి తీసుకెళ్లాగా ఆయన మూడు డిమాండ్లకు ఓకే చెప్పారు. రెండు డిమాండ్లను వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్‌ ఉంటున్న ఇంటి కోసం ఇద్దరూ పట్టుపడుతున్నారు. ఐదు డిమాండ్లలో 1.పర్లాకిమిడిలోని ఫ్యాక్టరీ, 2. టెక్కలి వెంకటేశ్వర కాలనీలోని నివాసాన్ని పిల్లలకు రిజిస్టర్‌ చేసేందుకు అంగీకరించారు. అలాగే 3వ డిమాండ్‌ చిన్న కుమార్తె పీజీ మెడికల్‌ ఎడ్యుకేషన్, వివాహం ఖర్చు భరించేందుకు ఓకే అన్నారు. దువ్వాడ శ్రీనివాస్‌ నివాసముంటున్న ఇళ్లు పిల్లల పేరున రిజిస్ట్రేషన్‌ చేయాలన్న 4వ డిమాండ్‌ను ఆయన తిరస్కరించారు. విడాకులు ఇవ్వకూడదన్న 5వ డిమాండ్‌ను సైతం తిరష్కరించారు. ఇంత రచ్చ జరిగాక ఇద్దరం కలిసి ఉండలేమని అంటున్నారు.

డిశ్చార్జ్‌ అయిన మాధురి..
ఇదిలా ఉంటే.. డిప్రెషన్‌లో ఉన్న దువ్వాడ శ్రీనివాస్‌ స్నేహితురాలు వాణి మూడు రోజుల క్రితం తన కారుదో ముందు నిలిచి ఉన్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమెకు స్వల్పంగా గాయాలయ్యాయి. మానసిక ఒత్తిడి కారణంగానే చనిపోవాలని అలా చేసినట్లు మాధురి తెలిపింది. రెండు రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని మంగళవారం డిశ్చార్జ్‌ అయింది. ఆమె కూడా కుటుంబ ఆస్తుల విషయంలో తాను జోక్యం చేసుకోనని స్పష్టం చేసింది.