Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu : జగన్ తో పోలిస్తే రెండు నెలల టీడీపీ పాలన ఎలా ఉంది?

Chandrababu : జగన్ తో పోలిస్తే రెండు నెలల టీడీపీ పాలన ఎలా ఉంది?

Chandrababu: అధికారంలోకి రాగానే.. ఏ రాజకీయ పార్టీ నాయకులైనా దానిని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదిస్తారు. ఈ సంపాదన అంతా అవినీతి మార్గంలోనే జరుగుతుంది. అయితే కేంద్రంలో బీజేపీ, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇటు బీజేపీ నేతలకు, అటు వైసీపీ నేతలు అక్రమంగా పెద్దగా సంపాదించుకోలేదు. దీనికి కారణం కేంద్రంలో మోదీ.. రాష్ట్రంలో జగన్‌. అక్రమ సంపాదనకు అనుమతించలేదు. దీంతో క్యాడర్‌ నుంచి ముఖ్య నేతలు అందరూ గుర్రుకానే ఉన్నారు. ఈ కారణంగానే వైసీపీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిందని కూడా ప్రచారం జరుగుతోంది. వైసీపీ కార్యకర్తల్లో 40 శాతం మంది టీడీపీకి ఓటు వేశారని అంచనా. జగన్‌ను ఓడించేందుకే వాళ్లు ఇలా చేశారట. అదే ఆ పార్టీ ఓటమికి కారణమైంది.

ఇప్పుడు దాడులు..
కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిన చందంగా మారింది వైసీపీ నాయకుల పరిస్థితి. సంపాదనకు అవకాశం ఇవ్వలేదన్న కోపంతో జగన్‌ను ఓడిస్తే… ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన నేతలు వైసీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు వాళ్లకు తత్వం బోధపడింది. తమకు తామే నష్టం చేసుకున్నామని భావిస్తున్నారు. జగన్‌ పరిపాలనలో ఏపీ ప్రజలకు డబ్బులు ఇవ్వడం జరిగింది తప్ప నేతలు అక్రమంగా డబ్బులు తిన్న సందర్భాలు చాలా తక్కువ. అవినీతి లేకుండా డబ్బులు అన్ని ప్రజలకే అందేలా చేసిన ఏకైక నేత జగన్‌.

కరువులో టీడీపీ నేతలు..
ఇదిలా ఉంటే.. ఐదేళ్లు దూరంగా ఉన్న టీడీపీ నేతలు తీవ్రమైన కరువులో ఉన్నారు. ఇన్నాళ్లూ ఎలాంటి సంపాదన, కాంట్రాక్టులు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో సంపాదనపై దృష్టిపెట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారు. తాము అధికారంలోకి వస్తే చేస్తామని అమలు సాధ్యం కాని అనేక మామీలు ఇచ్చారు. ఇప్పుడు వాటిని అమల చేసే ప్రయత్నం చేయకపోగా వైసీపీపై ప్రతీకారం తీర్చకోవడం, డబ్బులు సంపాదించుకోవడమే పనిగా పెట్టుకున్నారు. దీంతో టీడీపీ అసలు స్వరూపం బయటపడింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీలను తలుచుకుంటే భయమేస్తుందని ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. ఇక ప్రస్తుతం అమలు చేయలేమని అసెంబ్లీ వేదికగానే ప్రకటించారు. దీంతో తల్లికి వందనం కింద రూ.15 వేలు, రైతు భరోసా కింద రూ.20 వేలు ఇప్పటికీ ఇవ్వలేదు. ఫీజు రీయింబర్‌సమెంట్‌ విడుదల చేయలేదు. వసతి దీవెన, సున్నా వడ్డీ వంటి వాటి గురించి మాట్లాడటం లేదు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామని గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు దాని గురించి మాట్లాడిన వారే లేరు. ప్రతీ ఇంటికి ఉద్యోగం అన్నారు. నిరుద్యోగ భృతి కూడా ఇస్తామన్నారు. జాలర్లకు రూ.20 వేలు ఇస్తామని మాట ఇచ్చారు.

నడిచే స్కీంలకు బ్రేక్‌..
ఇదిలా ఉంటే.. జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీంలను కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిలిపివేస్తోంది. పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం విద్యాబోధన ఆపేశారు. రోజుకో మెనూ అనే విధానాన్ని పూర్తిగా తొలగించారు. పంటలకు ఉచిత బీమా ఎగొట్టారు. రేషన్, విత్తనాల కోసం మళ్లీ క్యూలైన్లో నిలబెట్టే దుస్థితి వచ్చింది. వాలంటీర్లను కూడా దారుణంగా చీట్‌ చేశారు. వీటికితోడు రాష్ట్రంలో హత్యలు, విధ్వంసాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో జగన్‌ సంక్షేమ పథకాల ద్వారా చాలా లబ్ధి పొందిన వారందరూ కూడా ఇప్పుడు జగనే నయం అని రియలైజ్‌ అవుతున్నారు. బాబు గ్యారెంటీలతో మోసం చేశారనే అసంతృప్తి పెరుగుతున్నట్లుగా రాజకీయవర్గాల్లో టాక్‌ నడుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version