Duvvada Srinivas Madhuri Wedding: తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద సెలబ్రిటీలు అయ్యారు దువ్వాడ శ్రీనివాస్( duvvada Srinivas ), దివ్వెల మాధురి జంట. వారు ఏం చేసినా సోషల్ మీడియాలో వార్తనే. తాజాగా వారు దండలు మార్చుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దువ్వాడ శ్రీనివాస్ స్నేహితుల సమక్షంలో ఈ ఇద్దరు దండలు మార్చుకోవడం ఇప్పుడు వైరల్ అవుతుంది. వాళ్ల ఇద్దరి వివాహం జరిగి ఏడాది అవుతున్నట్లు పేర్కొంటూ.. మొదటి యానివర్సరీ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు కనిపించారు. ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్, మాధురి పరస్పరం కేక్ కట్ చేసి దండలు మార్చుకున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అంశంగా మారిపోయింది.
Also Read: Jaganmohan Reddy : దువ్వాడ శ్రీనివాస్ పై జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం.. కీలక నిర్ణయం.. సత్వర ఆదేశాలు
ఏడాది కిందట రచ్చ..
గత ఏడాది ఎన్నికల ఫలితాల అనంతరం దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దువ్వాడ కొత్త ఇంట్లోకి ఆయన భార్య వాణి తో పాటు ఇద్దరు పిల్లలు ఎంట్రీ ఇవ్వడంతో రచ్చ నడిచింది. అప్పట్లోనే మాధురి( Madhuri) సైతం దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలోకి ప్రవేశించారు. అయితే సరిగ్గా ఏడాది తరువాత ఇప్పుడు ఈ జంట దండలు మార్చుకుంటూ, కేక్ కట్ చేసుకుంటూ కనిపించడం గమనార్హం. అయితే చట్టపరమైన అంశాలను అధిగమించి తాము ఒక్కటి అవుతామని పలుమార్లు ఈ జంట ప్రకటించింది. అయితే తాజా వీడియోలు చూస్తుంటే మాత్రం వీరి వివాహం అనధికారికంగా పూర్తయినట్లు అనుమానాలు వస్తున్నాయి. అత్యంత సన్నిహితుల నడుమ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నట్లు అక్కడ ఉన్న పరిస్థితి అర్థమవుతుంది. అయితే ఆ సెలబ్రేషన్స్ కు సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు ఆ జంట.
దువ్వాడ శ్రీనివాస్ వివాహ వార్షికోత్సవం..
దండలు మార్చుకుని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి pic.twitter.com/9OUnHjbdt7
— (@dmuppavarapu) June 26, 2025
ప్రస్తుతం వ్యాపార రంగంలో..
ప్రస్తుతం టెక్స్టైల్స్( textiles) వ్యాపార రంగంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంట. ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాసులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసింది. ప్రస్తుతం హైదరాబాదులో కాంచీపురం వకుల శారీస్ పెరిట వస్త్ర వ్యాపారంలో అడుగుపెట్టారు ఈ ఇద్దరు. తరచూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. వీరిద్దరికీ సంబంధించిన రీల్స్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసేవి. అందులో భాగంగానే ఈ వీడియో అని అంతా భావించారు. కానీ సన్నిహితుల సమక్షంలో దండలు మార్చుకోవడం.. కేక్ కట్ చేయడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. వారి బంధం మరింత దృఢమైనదని అర్థమైంది. కానీ దీనిపై ఇంతవరకు ఆ జంట క్లారిటీ ఇవ్వలేదు.
దువ్వెన పిలుస్తుంది నే పోతా,
అదే షాపింగ్ కి pic.twitter.com/CV5T1xGSlR— Rambabu pasumarthi (@pasumarthi66) June 23, 2025