https://oktelugu.com/

CM Relief Fund :  బాబు తలుచుకున్నాడు.. ఒకే పిలుపునకు వచ్చి పడిన రూ.400 కోట్లు

తెలుగు రాష్ట్రాల్లో మంచి సంస్కృతి కొనసాగుతోంది. విపత్తుల సమయంలో ప్రజలు బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు ముంచేత్తిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు కదలి వచ్చారు.

Written By:
  • Dharma
  • , Updated On : September 25, 2024 2:42 pm

    CM Relief Fund

    Follow us on

    CM Relief Fund : చంద్రబాబుకు పాలనా దక్షుడిగా మంచి పేరు ఉంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక రకంగా విమర్శలు ఉన్నా.. ఆయన వ్యవహార శైలి మాత్రం భిన్నంగా ఉంటుంది.అందరికంటే భిన్నంగా ఆలోచిస్తారని చాలా సందర్భాల్లో నిరూపితం అయింది. అందుకే అమరావతి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 33 వేల ఎకరాల భూమిని అందించారు. చంద్రబాబు ఇచ్చిన పిలుపుమేరకు వారంతా భూములు వదులుకున్నారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు అమరావతి రైతులు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ అమరావతికి మంచి రోజులు వచ్చాయి. చంద్రబాబు సైతం వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.గత వైసిపి ప్రభుత్వం నిలిపివేసిన కౌలును సైతం విడుదల చేశారు. చంద్రబాబుపై ఈ నమ్మకమే ప్రజల్లో బలంగా ఉంది. అందుకే తాజాగా ముఖ్యమంత్రి సహాయ నిధికి 400 కోట్ల రూపాయలు విరాళాలు రావడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి. విజయవాడకు వరద నించి తన నేపథ్యంలో.. దాతలు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. ఆ పిలుపు మేరకు దాతలు ముందుకు వచ్చి పెద్ద ఎత్తున సీఎం సహాయ నిధికి విరాళాలు ఇచ్చారు.

    * విజయవాడ ను ఆదుకునేందుకు
    మొన్నటి వర్షాలకు విజయవాడ మునిగిపోయిన సంగతి తెలిసిందే. బుడమేరు పొంగి ప్రవహించడంతో విజయవాడ నగరంలోని దాదాపు సగానికి పైగా ఇళ్లు ముంపు బారిన పడ్డాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. తీవ్రంగా నష్టపోయారు. కట్టు బట్టలతో మిగిలారు.సర్వస్వం కోల్పోయారు. ఈ తరుణంలో ప్రభుత్వం కూడా స్పందించింది.సహాయ కార్యక్రమాలను చేపట్టింది. పునరావాస చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్లో ఉండి సహాయ చర్యలను పర్యవేక్షించారు.అయితే వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.అందుకు స్పందించిన దాతలు ఏకంగా 400 కోట్లు అందించి ఉదారతను చాటుకున్నారు.

    * చంద్రబాబు కృతజ్ఞతలు
    వరద బాధితులకు సహాయార్థం 600 కోట్ల అవసరం కాగా.. అందులో దాతలు 400 కోట్ల రూపాయలు అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజల నుంచి ఈ స్థాయిలో స్పందన వస్తుందని అనుకోలేదని.. విపత్తుల సమయంలో ప్రజలు ఇలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సాయం అందించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. వరద సహాయ చర్యల్లో పాల్గొన్న అధికారులు,ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరూ సమన్వయంగా వ్యవహరించి పెను విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడమని గుర్తు చేసుకున్నారు. మొత్తానికైతే సీఎం సహాయ నిధికి ఏకంగా 400 కోట్ల రూపాయలు వసూలు కావడం గమనార్హం.