https://oktelugu.com/

Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ వరల్డ్ వైడ్ క్లోసింగ్ కలెక్షన్స్..42 కోట్లు పెట్టి కొంటే వచ్చిన లాభాలు ఎంతో తెలుసా!

సీడెడ్ ప్రాంతం లో 4 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఉత్తరాంధ్ర లో కూడా 4 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టడం విశేషం. ఈస్ట్ గోదావరి జిల్లాలో 2 కోట్ల 10 లక్షల రూపాయిలు, వెస్ట్ గోదావరి జిల్లాలో కోటి 62 లక్షల రూపాయిలు, గుంటూరు జిల్లాలో కోటి 87 లక్షల రూపాయిలు, కృష్ణ జిల్లాలో కోటి 86 లక్షల రూపాయిలు, నెల్లూరు జిల్లాలో కోటి 39 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

Written By:
  • Vicky
  • , Updated On : September 25, 2024 / 02:44 PM IST

    Saripodhaa Sanivaaram 5 days Box Office Collections

    Follow us on

    Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిల్చిన సంగతి తెలిసిందే. ‘దసరా’, ‘హాయ్ నాన్న’ చిత్రాలతో వరుస హిట్స్ ని అందుకున్న నాని, ‘సరిపోదా శనివారం’ చిత్రం తో మరో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రం విడుదలకు ముందే ప్రేక్షకుల్లో అంచనాలు బాగా ఉండేవి. ఆ అంచనాలను పెంచుతూనే ట్రైలర్ కూడా ఉన్నింది. కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాం అనే నమ్మకాన్ని హీరో నాని ప్రొమోషన్స్ లో ఆడియన్స్ కి కల్పించాడు. దాని ఫలితం ఓపెనింగ్ వసూళ్ల నుండే కనిపించింది. ఆంధ్ర, తెలంగాణ తో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం నాని కెరీర్ లో టాప్ 3 ఓపెనింగ్స్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిల్చింది.

    అయితే ఇన్ని రోజులు దిగ్విజయంగా థియేటర్స్ లో నడిచిన ఈ సినిమా వసూళ్లు క్లోసింగ్ కి వచ్చేసింది. ప్రాంతాల వారీ గా ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టింది, బయ్యర్స్ కి ఎంత లాభాలను తెచ్చిపెట్టింది అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం. నైజాం ప్రాంతం లో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు 9 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు. ఓపెనింగ్స్ నుండే దుమ్ము లేపుతూ వచ్చిన ఈ చిత్రం ఫుల్ రన్ లో 15 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే దాదాపుగా 6 కోట్ల రూపాయలకు పైగానే లాభాలు అన్నమాట. ఈ సినిమాకి ముందు దిల్ రాజు నిర్మించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. అలా నష్టాల్లో ఉన్న దిల్ రాజు ని మళ్లీ ట్రాక్ లోకి తెచ్చింది ఈ చిత్రం.

    అలాగే సీడెడ్ ప్రాంతం లో 4 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఉత్తరాంధ్ర లో కూడా 4 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టడం విశేషం. ఈస్ట్ గోదావరి జిల్లాలో 2 కోట్ల 10 లక్షల రూపాయిలు, వెస్ట్ గోదావరి జిల్లాలో కోటి 62 లక్షల రూపాయిలు, గుంటూరు జిల్లాలో కోటి 87 లక్షల రూపాయిలు, కృష్ణ జిల్లాలో కోటి 86 లక్షల రూపాయిలు, నెల్లూరు జిల్లాలో కోటి 39 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రం 32 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టగా, కర్ణాటక+ రెస్ట్ ఆఫ్ ఇండియా లో 7 కోట్ల 20 లక్షల రూపాయిలు, ఓవర్సీస్ లో 12 కోట్ల 42 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఓవరాల్ ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 42 కోట్ల రూపాయలకు జరగగా, వరల్డ్ వైడ్ క్లోసింగ్ వసూళ్లు 52 కోట్ల రూపాయిలు వచ్చాయి, అంటే 10 కోట్ల రూపాయిలు లాభాలు అన్నమాట.