https://oktelugu.com/

Devara: బిగ్ బ్రేకింగ్ : ‘దేవర’ చిత్రానికి హై కోర్టు లో చుక్కెదురు..చివరి నిమిషంలో ఫ్యాన్స్ కి చేదు వార్త!

'దేవర' చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రెండు వారల పాటు టికెట్ రేట్స్ ని మల్టీ ప్లెక్స్ థియేటర్స్ లో 135 రూపాయలకు, సింగల్ స్క్రీన్స్ టాప్ క్లాస్ లో 110 రూపాయలకు, అలాగే లోయర్ క్లాస్ 60 రూపాయలకు అదనంగా పెంచుకోవడానికి అనుమతిని ఇచ్చారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 25, 2024 / 02:41 PM IST

    Devara(3)

    Follow us on

    Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పూర్తి స్థాయి లో ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ లో ఆల్ టైం రికార్డు గ్రాస్ దిశగా ఈ చిత్రం అడుగులు వేస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా టిక్కెట్లు హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి. ‘దేవర’ చిత్రానికి దయచేసి ఒక్క టికెట్ ఇప్పించండి అంటూ ఎక్కడ చూసిన ఫ్యాన్స్ ప్రెసిడెంట్స్ కి ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. చాలా కాలం తర్వాత ఒక సినిమాకి ఈ రేంజ్ డిమాండ్ ని చూస్తున్నాం అంటూ ట్రేడ్ పండితులు సైతం చెప్పుకొస్తున్నారు. అనేక ప్రాంతాలలో ఆల్ టైం రికార్డ్స్ పెట్టే దిశగా దూసుకుపోతున్న ‘దేవర’ చిత్రానికి ఇప్పుడు హై కోర్టులో చుక్కెదురు అయ్యింది.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే ‘దేవర’ చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రెండు వారల పాటు టికెట్ రేట్స్ ని మల్టీ ప్లెక్స్ థియేటర్స్ లో 135 రూపాయలకు, సింగల్ స్క్రీన్స్ టాప్ క్లాస్ లో 110 రూపాయలకు, అలాగే లోయర్ క్లాస్ 60 రూపాయలకు అదనంగా పెంచుకోవడానికి అనుమతిని ఇచ్చారు. ఇలా దేవర కు కావాల్సిన అన్ని అనుమతులు ఇచ్చినందుకు ఎన్టీఆర్ తో పాటు, మూవీ టీం మొత్తం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ కు కృతఙ్ఞతలు తెలియచేస్తూ ట్వీట్స్ కూడా వేశారు. అయితే హై కోర్టు 14 రోజుల వ్యవధిని 10 రోజులకు కుదించాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే సూపర్ హిట్ చిత్రాలకు కూడా టికెట్ రేట్స్ పెంపు కారణంగా వీకెండ్ తర్వాత సరైన ఆక్యుపెన్సీలు రావడం ప్రస్తుతం చాలా కష్టం అయ్యింది. అంత రేట్స్ పెట్టి ఎవరు చూస్తారులే, ఒక్క నెల రోజులు ఆగితే ఓటీటీ లోకి వచ్చేస్తుంది అనే ఫీలింగ్ తో ఉంటారు ఆడియన్స్.

    14 రోజులు టికెట్ రేట్స్ పెంచుకునే అవసరం లేదు, 10 రోజులు సరిపోతుంది, సినిమాకి లాంగ్ రన్ కావాలి అని కొంతమంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అర్థ రాత్రి 1 గంట సమయం నుండి షోస్ ప్రారంభించుకోబోతుంది. ఇంతకు ముందు టాక్ కోసం నార్త్ అమెరికా ప్రీమియర్స్ కోసం ఎదురు చూసేవారు ఆడియన్స్. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు, రెండు తెలుగు రాష్ట్రాల నుండే టాక్ వచ్చేస్తుంది. పాజిటివ్ టాక్ వస్తే ఆకాశమే హద్దు అనే విధంగా వసూళ్లు ఉంటాయి . ఎందుకంటే అక్టోబర్ 3 వ తారీఖు నుండి 12 వరకు దసరా సెలవులు ఉంటాయి. ఒకవేళ టాక్ రాకుంటే మాత్రం చాలా ప్రమాదం, ఎందుకంటే ఇంతకుముందు అర్థ రాత్రి షోస్ వేసుకున్న సినిమాలకు టాక్ రాలేదు, మరి దేవర విషయం లో ఏమి జరగబోతుందో చూడాలి.