గతేడాది కరోనా ప్రపంచాన్ని ఎంతలా వణికించిందో అందరికీ తెలిసిందే. ఇక ఇండియా సైతం అన్నివిధాలా నష్టాలను చవిచూసింది. అటు ప్రాణనష్టంతోపాటు ఆర్థికంగానూ దివాళ తీసింది. గత స్మృతులను వదిలి రెండు నెలల నుంచే ప్రజలు మామూలు లైఫ్‌కి వస్తున్నారు. ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. వ్యాపార, వాణిజ్యాలూ ఊపందుకున్నాయి. మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. కరోనాను పూర్తిగా మరిచి నార్మల్ లైఫ్‌లోకి వచ్చారు.
Also Read: గేమ్ స్టార్ట్ చేసిన బైడెన్ : మరోసారి సిరియాపై వైమానిక దాడులు
దేశంలో సెకండ్ వేవ్ కరోనా ముంచుకొస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో కరోనా తిరగదోడుతోంది. గతంలో కరోనా వచ్చిన వాళ్లకు సైతం మళ్లీ కరోనా సోకుతుండటంతో వైద్య వర్గాల్లో ఆందోళన నెలకొన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. కచ్చితంగా భౌతికదూరం పాటించాలని.. మాస్కులు ధరించాలని సూచిస్తున్నాయి. ఇదిలా ఉంటే విమాన ప్రయాణాలపై కూడా నిషేధం విధించాయి. అయితే.. ఈ నిషేధాన్ని మార్చి 31 వరకు పొడిగించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఓ ప్రకటన విడదల చేసింది.
అయితే.. కార్గో విమానాలు డీజీసీఏ అనుమతి పొందిన ఫ్లైట్లకు మినహాయింపు ఇచ్చారు. మరోవైపు.. ఇప్పటికే వందే భారత్ మిషన్ కింద కొన్ని దేశాలకు విమానాలు నడుస్తున్న విషయం తెలిసిందే. సెకండ్ వేవ్ కరోనాతో కేంద్రం అలర్ట్ అయ్యింది. ఓ వైపు వ్యాక్సినేషన్ కొనసాగుతున్నప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు అలర్టయ్యాయి. అయితే.. ఇప్పుడు ప్రజలకు సోకుతున్నది.. పాత వైరస్సా.. లేక కొత్త స్ట్రెయిన్ కరోనానా అన్న విషయంపై వైద్య వర్గాలకు క్లారిటీ లేదు. దీంతో తీవ్ర ఆందోళన నెలకొన్నది.
Also Read: తమిళులకు తాయిలాల మీద తాయిలాలు: పళని స్వామి మళ్లీ గెలిచేనా..?
మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోనూ కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బ్రెజిల్ బ్రిటన్ దక్షిణాఫ్రికా దేశాల్లో కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమాన రాకపోకలపై నిషేధం విధించింది. ఏది కాకముందే వందే భారత్ మిషన్ ద్వారా వస్తున్న ప్రయాణికులకు సైతం ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపించినా.. పాజిటివ్ అని తేలినా వెంటనే క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. అందుకే.. మరోసారి అందరూ అలర్ట్‌గా ఉండాలని వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్