https://oktelugu.com/

బిగ్ బాస్-4 బ్యూటీకి హీరోయిన్ అవకాశాలు..!

బుల్లితెర ప్రేక్షకులను కరోనా టైంలోనూ బిగ్ బాస్-4 ఎంతగానో అలరిస్తోంది. బిగ్ బాస్-4లో పెద్దగా సెలబ్రెటీలు లేకపోవడంతో ప్రేక్షకులు కొంత నిరుత్సాహం చెందిన ఆ తర్వాత మెల్లిగా కనెక్టయ్యారు. ఇక బిగ్ బాస్-4లో పలువురు అందగెత్తెలు సందడి చేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. Also Read: ఈ టాలెంటెడ్ డైరెక్టర్ బాధ వర్ణనాతీతం ! బిగ్ బాస్-4లోని ఆడ కంటెస్టెంట్లలో హీరోయిన్ మొనాల్ గజ్జల్.. యాంకర్ లాస్య.. దెత్తడి హారిక.. అరియానాలు ప్రస్తుతం హౌస్ లో కొనసాగుతుండగా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 11, 2020 / 05:58 PM IST
    Follow us on

    బుల్లితెర ప్రేక్షకులను కరోనా టైంలోనూ బిగ్ బాస్-4 ఎంతగానో అలరిస్తోంది. బిగ్ బాస్-4లో పెద్దగా సెలబ్రెటీలు లేకపోవడంతో ప్రేక్షకులు కొంత నిరుత్సాహం చెందిన ఆ తర్వాత మెల్లిగా కనెక్టయ్యారు. ఇక బిగ్ బాస్-4లో పలువురు అందగెత్తెలు సందడి చేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.

    Also Read: ఈ టాలెంటెడ్ డైరెక్టర్ బాధ వర్ణనాతీతం !

    బిగ్ బాస్-4లోని ఆడ కంటెస్టెంట్లలో హీరోయిన్ మొనాల్ గజ్జల్.. యాంకర్ లాస్య.. దెత్తడి హారిక.. అరియానాలు ప్రస్తుతం హౌస్ లో కొనసాగుతుండగా స్వాతి దీక్షిత్, దివీలు, దేవినాగవల్లి ఎలిమినేషన్ అయ్యారు. దసరా రోజు ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమానికి సమంత హోస్టుగా చేయగా ఆరోజు ఎలిమనేషన్లో భాగంగా దివీ ఎలిమినేట్ అయింది.

    Also Read: మెగాస్టార్ కోలువాలని పూజలు చేస్తున్న హీరోయిన్.. ఎవరో తెలుసా?

    బిగ్ బాస్-4 బ్యూటీగా పేరుతెచ్చుకున్న దివీ హౌస్ ఉన్నంత సేపు ప్రేక్షకులను తనదైన ఫార్మమెన్స్ తో ఆకట్టుకుంది. దివీ హౌస్ లో తనపని తాను చేసుకుంటూ వివాదాలకు దిగేదికాదు. దీంతోనే ఆమెను బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిందనే టాక్ ఉంది. బిగ్ బాస్ ఎలిమినేషన్ పై కూడా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    దివీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక ఆమెకు రెండు వెబ్ సీరిసుల్లో నటించే ఆఫర్లు దక్కాయి. దీంతోపాటు రెండు చిన్న సినిమాల్లో ఆమెకు హీరోయిన్ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు నిర్మాతలకు ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తొలుత వెబ్ సిరీసులు నటించనున్న దివీ త్వరలోనే హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.