Digital Lakshmi Scheme for Women in AP : ప్రభుత్వం ప్రస్తుతం ఈ డిజిటల్ సేవా కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమ తొలి రూపుపై పూర్తి కసరత్తు చేస్తుంది. అయితే పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ కె వెంకటేశ్వర్రావు త్వరలో ప్రభుత్వము దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులను ఇవ్వనుంది అని బిబిసి కి తెలిపారు. ప్రభుత్వం మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలను అందించడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ లక్ష్మి కార్యక్రమం పేరుతో డ్వాక్రా సంఘాలలో విద్యావంతులైన మహిళలకు స్వయం ఉపాధి కల్పించే ముఖ్య ఉద్దేశంతో ఉందని వెంకటేశ్వరరావు బిబిసితో చెప్పుకొచ్చారు. డిజిటల్ లక్ష్మి పథకానికి సంబంధించి అధికారిక ప్రకటన జూన్ 12వ తేదీన వచ్చే అవకాశం ఉందని అన్నారు.
డిజిటల్ ఇండియా నినాదంతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలలో డిజిటల్ సాధికారత లక్ష్యంగా ప్రతిచోట కామన్ సర్వీసెస్ సెంటర్ ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ప్రజలకు ఈ కామన్ సర్వీసెస్ సెంటర్లో అనేక ఆన్లైన్ సేవలను అందిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సర్వీసెస్ సెంటర్లో ప్రజలకు వివిధ ప్రభుత్వ సేవలకు సంబంధించిన సంక్షేమ పథకాలను అలాగే ప్రజా వినియోగ సేవలను అందించడంలో ప్రవేశ ద్వారాలుగా నిలిచాయి. అయితే ఈ సి ఎస్ సి లైసెన్స్ ను పొందడానికి అర్హులైన విద్యావంతులు కేంద్ర నిబంధనల ప్రకారం రూ.1,50,000 ఖర్చు అవుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలో డ్వాక్రా మహిళల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.1,50,000 ఖర్చును మాఫీ చేయించి తొలివిడతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదివేల సిఎస్సి లను ఇప్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Also Read : రేవంత్ రెడ్డి సమర్పించు.. ‘రూ.500కే గ్యాస్ సిలిండర్’ పాట.. ఇలా కూడా చేస్తారా? వైరల్ వీడియో
మెప్మా ఎండి వెంకటేశ్వరరావు దీనికి సంబంధించి ఇప్పటికే సిఎస్సి సేవలు అందించేందుకు ఈ గవర్నెన్స్ తో మెప్మా ఎం ఓ యు ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ముందుగా అన్ని పట్టణాలలో మరియు నగరాలలో కలిపి ప్రతి 250 ఇళ్లకు ఒకటి డిజిటల్స్ సేవ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం భావిస్తుంది. తొలి దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కోసం మొత్తం పదివేల డిజిటల్ సేవా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొని వచ్చేందుకు నిర్ణయించారు. అర్హత ఉన్న డ్వాక్రా మహిళలు ఈ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడానికి తమ ఇంటి ముందు ఒక చిన్న సేవా కేంద్రం తరహాలో ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా ఆ చుట్టుపక్కల ప్రజలకు అవసరమైన సేవలను అందించాల్సి ఉంటుంది.