Deputy CM Pawan Kalyan : ఏపీలో శాంతిభద్రతలపై డిప్యూటీ సీఎం పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైతే తాను హోం మంత్రి బాధ్యతలు స్వీకరిస్తానని సంకేతాలు పంపారు. పవన్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. అయితే హోం మంత్రి వంగలపూడి అనిత మాత్రం పాజిటివ్ గా తీసుకున్నారు.పవన్ సైతం సోషల్ మీడియా ఆగడాలపైనే విరుచుకుపడినట్లు తెలుస్తోంది. పవన్ కామెంట్స్ తరువాతనే వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధుల పై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. చాలామంది అరెస్టు కూడా జరిగింది. మరోవైపు పవన్ ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో చర్చలు జరపడం.. అటు నుంచి వచ్చిన తరువాత పవన్ హోం మంత్రి అనిత కలవడం.. సీఎం చంద్రబాబు తో పవన్ చర్చలు జరపడం వంటివి ఆసక్తికరంగా మారాయి. ఇదిలా ఉండగానే రాష్ట్ర డిజిపి ద్వారకాతిరుమలరావు డిప్యూటీ సీఎం పవన్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సాధారణంగా డీజీపీ ముఖ్యమంత్రి తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మాత్రమే కలుస్తుంటారు. వారితోనే నిరంతరం టచ్ లో ఉంటారు. హోం మంత్రిగా ఎవరున్నా.. శాంతి భద్రతల విభాగం ముఖ్యమంత్రుల చేతుల్లో ఉంటున్న నేపథ్యంలో హోం మంత్రులతో పెద్దగా దగ్గరగా ఉండరు. పోలీస్ బాస్ కు ప్రత్యక్ష సంబంధాలన్నీ సీఎంతోనే కొనసాగుతాయి. ఏ రాష్ట్రంలోనైనా ఇదే కనిపిస్తుంది.
* తాజా పరిణామాల నేపథ్యంలో
కానీ ఏపీలో అనూహ్యంగా పోలీస్ బాస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు శాంతిభద్రతలు క్షీణించాయని.. హోం శాఖ మంత్రి సరిగ్గా రివ్యూ చేయడం లేదని పవన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అనేక అంశాలు తెరమీదకు వచ్చాయి. ఇంకో వైపు సోషల్ మీడియాలో చెలరేగుతున్న మూకలను కట్టడి చేస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే డీజీపీ నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయానికి వచ్చారు. ఆయనతో భేటీ అయ్యారు. దీంతో కొత్త చర్చ ప్రారంభం అయ్యింది.
* అనేక సందేహాలు
అయితే వరుస పరిణామాల నేపథ్యంలో డిజిపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవడం ఏమిటి అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. హోం శాఖ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేరే ఆలోచనతో ఉందా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆ శాఖ మంత్రి బాధ్యతలు పవన్ కు అప్పగించారా? లేకుంటే హోం శాఖపై అదనపు బాధ్యతలు ఏమైనా ఇచ్చారా? అనే చర్చ మాత్రం మొదలైంది. లేకుంటే ముఖ్యమంత్రిని కలవాల్సిన డిజిపి.
.. డిప్యూటీ సీఎంను కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? అన్నది హాట్ టాపిక్ అవుతోంది. తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానం వ్యక్తం అవుతోంది. దీనిపై పవన్ క్లారిటీ ఇస్తే గానీ తెలియని పరిస్థితి నెలకొంది.