https://oktelugu.com/

Shekhar Kammula-Mahesh Babu : శేఖర్ కమ్ముల మహేష్ బాబు కాంబో లో మిస్ అయిన ఆ రెండు సినిమాలు ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికి కొందరికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపు అయితే వస్తుంది. ఇక వాళ్లు మాత్రమే తమకంటూ ఒక సెన్సిబుల్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు. ఇక అందులో శేఖర్ కమ్ముల ఒకరు. ఈయన చేసిన సినిమాలన్నీ ప్రేక్షకుల్లో చెరగని ముద్రను వేసుకుంటాయనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : November 10, 2024 / 12:08 PM IST

    Shekhar Kammula-Mahesh Babu

    Follow us on

    Shekhar Kammula-Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడికి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఆయన చేసే సినిమాలు చాలా సెన్సిబుల్ గా ఉండడమే కాకుండా ప్రేక్షకులందరిని అమితమైన ఇష్టానికి గురి చేస్తూ ఉంటాయి. అందువల్లే ఆయనలోని దర్శకుడు ప్రతిసారి ఎలివేట్ అవుతూ ఉంటాడు. ఆయన ఎలాంటి సినిమాలు చేసినా కూడా ఆయనకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకోవడంలో ఆయన ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు… అలాంటి శేఖర్ కమ్ముల ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు… ఇక ఇదిలా ఉంటే ఆయన ఎంటర్ కెరియర్ లో ఇప్పటి వరకు స్టార్ హీరోలతో సినిమాలు చేయలేదు. కారణం ఏంటి అంటే ఆయన రాసుకున్న కథలు చిన్న కాన్సెప్ట్ తో ఉండడమే కాకుండా స్టార్ హీరోల రేంజ్ ని టచ్ చేసే కథలను ఆయన రాయలేడు అంటూ కొందరు హీరోలు అతన్ని పక్కన పెట్టేసారు. మరి మొత్తానికైతే ఆయనలోని దర్శకత్వ ప్రతిభను బయటకు తీస్తూ ఎప్పటికప్పుడు ఆయన ఇండస్ట్రీలో సక్సెస్ ని సాధిస్తూనే వస్తున్నాడు. ఒకసారి ఒక సినిమాతో సక్సెస్ సాధిస్తే మరోసారి మరొక సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. ఇక ఏది ఏమైనా కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు రెండు సినిమాలు చేయాల్సింది. కానీ ఆ రెండు సినిమాలు కూడా అనుకోకుండా మిస్ అయ్యాయి అనే విషయం మనలో చాలా మందికి తెలియదు.

    శేఖర్ కమ్ముల రెండోవ సినిమా అయిన గోదావరి సినిమాని మొదట మహేష్ బాబు తో చేయాలని ప్రణాళిక రూపొందించుకున్నాడు. కానీ మహేష్ బాబు అప్పటికే మాస్ సినిమాలు చేస్తూ ఉండడంతో అలాంటి క్లాస్ మూవీ ని తను చేస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే ఉద్దేశ్యంతో ఆయన ఆ సినిమాను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.

    ఇక ఆ తర్వాత ఆయన ఫిదా సినిమాని మహేష్ తో చేయాలని ఫిక్స్ అయ్యాడు. కానీ మహేష్ బాబు ఆ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి ఎక్కువగా స్కోప్ ఉంది. హీరో పాత్ర పెద్దగా ఎలివేట్ అవ్వడం లేదనే ఉద్దేశ్యంతో ఆ స్క్రిప్ ని రిజెక్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది.

    ఇక మొత్తానికైతే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో రెండు సినిమాలు చేయాల్సి ఉన్నా కూడా చేయకుండా చివరి నిమిషంలో ఆయన హ్యాండ్ ఇవ్వడంతో వేరే హీరోలతో సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నాడు. అవి శేఖర్ కమ్ముల కెరియర్ లో చాలా ప్రత్యేకమైన సినిమాలనే చెప్పాలి…