Appudo Ippudo Eppudo Trailer Review : తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక మూస ధోరణి వెల్తున్నప్పుడు చిన్న సినిమాలను సైతం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో చేసి సూపర్ సక్సెస్ లను సాధించొచ్చు అని నిరూపించుకున్న హీరో నిఖిల్… ప్రస్తుతం ఆయన ‘స్వయంభు ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటుగా ఇంతకుముందే ‘సుధీర్ వర్మ’ దర్శకత్వంలో ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే సినిమాని చేశాడు. ఈ సినిమా నవంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక అందులో భాగంగానే ఈ సినిమా చేస్తున్న మేకర్స్ ఈరోజు ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా చూస్తుంటే ఆధ్యాంతం ఆసక్తిగా సాగడమే కాకుండా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసిందనే చెప్పాలి…
ఇక ఈ ట్రైలర్ ని కనక అబ్జర్వ్ చేస్తే నిఖిల్ ఇందులో ఒక కార్ రేసర్ గా కనిపించబోతున్నాడు. తను కార్ రేస్ ఆడడానికి కావాల్సిన డబ్బులను అలాగే విదేశాల్లో ఉండడానికి కావలసిన ఫెసిలిటీస్ దొరకాలంటే అక్కడే సెటిల్ అయిన ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చూస్తాడు. అలాగే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇక ఈయన కార్ రేస్ కి సంబంధించిన పనులను వేగవంతం చేసుకుంటున్న క్రమంలో అనుకోకుండా ఒక క్రైమ్ లో ఇరుక్కుంటాడు. ఇక అక్కడి నుంచి ఆయన కెరియర్ ఎలా సాగింది అనేదాన్ని తెలియజేస్తూ ఈ ట్రైలర్ కట్ ఇచ్చారు. ఇక ఇందులో కామెడీ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో పాటు హీరో హీరోయిన్ల మధ్య ఉండే రొమాంటిక్ సీన్స్ ని కూడా ట్రైలర్ లో రివిల్ చేశారు…
ఇక ఈ సినిమా స్టోరీ ని ఆల్మోస్ట్ మనకి ట్రైలర్ లోనే చూపించారు…ఇక ట్రైలర్ అయితే అద్భుతంగా ఉన్నప్పటికి సినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మొత్తాన్ని ట్రైలర్ లోనే చూపించిన తర్వాత థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడికి కొత్తగా ఏం చెప్పబోతున్నారనే విషయంలోనే దర్శకుడు చాలా క్లారిటీగా ఉండాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం ట్రైలర్ లో చూపించిన కథకి అనుగుణంగానే సినిమా కూడా స్ట్రైయిట్ నరేషన్ లో నడిచినట్టయితే ప్రేక్షకులు ఎంగేజ్ అవ్వకపోవచ్చు. కాబట్టి ప్రేక్షకున్ని థ్రిల్ కి గురి చేసే సన్నివేశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉండాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం ఈ సినిమాకి అనుకున్నంత ఆదరణ దక్కకపోవచ్చు…
ఇక వైవా హర్ష, సుదర్శన్, సత్య కామెడీ ని హైలెట్ చేస్తూ ట్రైలర్ కట్ అయితే ఇచ్చారు. మరి వీళ్ళు సినిమా మొత్తం ఆద్యంతం ప్రేక్షకుడిని ఎంటర్ టైన్ చేసే విధంగానే వీళ్ళ క్యారెక్టర్లను డిజైన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది…ఇక ఈ ట్రైలర్ ప్రేక్షకుడిలో క్యూరియాసిటిని రేకెత్తిస్తున్నప్పటికి సినిమాలో ఉండే ఎలిమెంట్స్ ని రివిల్ చేసి ప్రేక్షకుడిని థియేటర్ కి రప్పించడం అనేది ఒక ఫార్మాట్…
అలాగే ట్రైలర్ లో సినిమాకు సంబంధించిన స్టోరీని చెప్పకుండా ఏం చెప్పబోతున్నారు అనేది సస్పెన్స్ లో ఉంచి ప్రేక్షకుడి ని థియేటర్ కి తీసుకురావడం మరొక స్టైల్.. వీటిలో ఏ స్టైల్ ను ఫాలో అయిన కూడా ట్రైలర్ లో చూపించిన దానికంటే థియేటర్లో ప్రేక్షకుడు సినిమా చూసినప్పుడు కథలో వైవిధ్యం అయితే కనిపించాలి. లేకపోతే మాత్రం ప్రేక్షకులు ఆ సినిమా నుంచి పూర్తిగా డిస్ కనెక్ట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. తద్వారా సినిమాకి కూడా భారీగా దెబ్బ పడే అవకాశాలు కూడా లేకపోలేదు… ఇక నిఖిల్ ఈ సినిమాలో తన స్వార్థానికి ఒక ఇద్దరు అమ్మాయిలతో రిలేషన్ షిప్ ను మెయింటైన్ చేస్తున్నట్టుగా కూడా మనకు ట్రైలర్ చివర్లో చూపించారు.అలాగే మాఫియా వాళ్ళతో కూడా గొడవులు పెట్టుకున్నాడు… ఇక ఈ ట్రైలర్ మొత్తం డైరెక్టర్ పర్సెప్షన్ లోనే ఉంది…ఆడియెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఆలోచించి ట్రైలర్ కట్ చేస్తే బాగుండేది… ఇది ఒక్కటే ఈ ట్రైలర్ లో మిస్ అయినట్టుగా కనిపిస్తుంది…
మరి ఆ అమ్మాయిలతో రిలేషన్ షిప్ ని మెయింటైన్ చేయడానికి కారణం ఏంటి నిఖిల్ క్రైమ్ లో ఇరుక్కొని ఎలా తప్పించుకోబోతున్నాడనే పాయింట్స్ ని సినిమాలో దర్శకుడు సుధీర్ వర్మ ఎలా డీల్ చేస్తాడు అనే దానిమీద ఈ సినిమా సక్సెస్ అనేది ఆధారపడి ఉంది. ఇక ఎనిమిదో తేదీ వస్తే గానీ వీటన్నింటికీ ఒక క్లారిటీ అయితే దొరికే పరిస్థితి కనిపించడం లేదు…