https://oktelugu.com/

Deputy CM Pawan Kalyan : చేతులెత్తేసిన పవన్.. చంద్రబాబుపై జనసేన భారం!

Deputy CM Pawan Kalyan : పశ్చిమగోదావరి జిల్లా( West Godavari district) పరిధిలోకి వచ్చే కొల్లేరు సరస్సు కొన్నేళ్లుగా కబ్జాలకు గురైంది. దీంతో కొల్లేరులోకి వెళ్లాల్సిన జల ప్రవాహాలకు ఆటంకం కలుగుతోంది. దాని కారణంగా వరదలు సంభవిస్తున్నాయి. దీంతో 2006లో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలతో కొల్లేరు ఆపరేషన్ చేపట్టారు.

Written By: , Updated On : March 20, 2025 / 01:54 PM IST
kolleru

kolleru

Follow us on

Deputy CM Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan ) ఓ విషయంలో సంక్లిష్టతను ఎదుర్కొంటున్నారు. ఎలా ముందుకెళ్లాలో తెలియక సతమతం అవుతున్నారు. ప్రజా ప్రయోజనాల విషయంలో ఆయన దూకుడుగా ఉంటారు. కానీ ఇప్పుడు అదే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించి వెనక్కి తగ్గుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన చంద్రబాబుపై ఆధారపడుతున్నారు. ఆయన అనుభవంతో ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపుతారని ఆశిస్తున్నారు. కొల్లేరు సరస్సులో ఆక్రమణల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. దీనిపై చర్యలు చేపట్టాల్సిన అవసరం అటవీ శాఖకు ఏర్పడింది. ఆ శాఖ బాధ్యతలను చూస్తున్న పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి పెరుగుతోంది.

Also Read : పిఠాపురం ఇన్చార్జిగా నాగబాబు.. తీవ్ర అంతర్మధనంలో వర్మ

* కొన్నేళ్లుగా కొల్లేరు కబ్జాలు..
పశ్చిమగోదావరి జిల్లా( West Godavari district) పరిధిలోకి వచ్చే కొల్లేరు సరస్సు కొన్నేళ్లుగా కబ్జాలకు గురైంది. దీంతో కొల్లేరులోకి వెళ్లాల్సిన జల ప్రవాహాలకు ఆటంకం కలుగుతోంది. దాని కారణంగా వరదలు సంభవిస్తున్నాయి. దీంతో 2006లో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలతో కొల్లేరు ఆపరేషన్ చేపట్టారు. వేల సంఖ్యలో చేపల చెరువు గట్లను నాటుబాంబులతో పేల్చేశారు. అయితే అటు తరువాత ఆపరేషన్ నెమ్మదించింది. అయితే తాజాగా సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలయింది. దీంతో ప్రభుత్వం పై ఒత్తిడి పెరుగుతోంది. మూడు నెలల్లో ఆక్రమణలు తొలగిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం వేగంగా అడుగులు వేయలేకపోతోంది.

* అటవీ శాఖ పరిధి కావడం..
అయితే ఆక్రమణల తొలగింపు అనేది అటవీ శాఖ( Forest Department) పరిధిలో ఉంది. ఆ శాఖకు బాధ్యతలు వహిస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే కొల్లేరు ఆపరేషన్ పై ముందుకెళ్తే స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. అలాగని సైలెంట్ గా ఊరుకుంటే సుప్రీంకోర్టు నుంచి ప్రతికూల తీర్పు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ భారం మొత్తాన్ని సీఎం చంద్రబాబుపై వేశారు పవన్ కళ్యాణ్. ఆయన తనకున్న అనుభవంతో నిర్ణయం తీసుకుంటారని జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన బలంగా ఉంది. అక్కడ ఏమాత్రం చేపల చెరువులను టచ్ చేస్తే ఇబ్బందికర పరిస్థితులు రాక మానవు. అందుకే జనసేన ఈ విషయంలో సైలెంట్ అయినట్లు తెలుస్తోంది.

* సంక్లిష్టతకు వైయస్సార్ సర్కార్ కారణం
మరోవైపు ఇంతటి సంక్లిష్టతకు వైయస్ రాజశేఖర్ రెడ్డి( Y S Rajasekhara Reddy ) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కారణమని జనసేన ఆరోపిస్తోంది. అప్పట్లో సామాజిక పరిస్థితులు పట్టించుకోకుండా.. కోర్టులతో పాటు ప్రభుత్వాలు వ్యవహరించాలని అభిప్రాయపడింది జనసేన. కొల్లేరు సమస్య సంక్లిష్టం కావడానికి రాజకీయ అవసరాల కోసం ఆడిన ఆటలే కారణంగా విశ్లేషించింది. ఒడిస్సా లోని చిలుక సరస్సు విషయంలో ఇటువంటి చిక్కులే ఎదురయ్యాయి. కానీ అక్కడి ప్రభుత్వం కొన్ని రకాల పరిష్కార మార్గాలను అమలు చేసింది. దీంతో అక్కడి పరిస్థితిని అధ్యయనం చేసుకొని సీఎం చంద్రబాబు ఒక నిర్ణయానికి రానున్నారు. సంక్లిష్ట సమస్యను చంద్రబాబు పరిష్కరిస్తారని కూడా జనసేన ఆశాభావం వ్యక్తం చేసింది.
Also Read : ఈ వయసులో ఆ ఆటలా.. ఎమ్మెల్యేలను ఆస్పత్రి పాలు చేశాయి