https://oktelugu.com/

You tube : యూ ట్యూబ్ లో వ్యూస్, లైక్స్, కామెంట్స్.. సంచలనం కలిగిస్తున్న వీడియో..

You tube : ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ పై కొరడా ఝుళిపించింది. వాటికి ప్రమోషన్లు చేసిన సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్స్ కు నోటీసులు కూడా జారీ చేసింది.

Written By: , Updated On : March 20, 2025 / 01:59 PM IST
You tube

You tube

Follow us on

You tube : ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ పై కొరడా ఝుళిపించింది. వాటికి ప్రమోషన్లు చేసిన సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్స్ కు నోటీసులు కూడా జారీ చేసింది. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్స్ గా చెలామణి అవుతున్న వ్యక్తులు యూ ట్యూబ్ లో లక్షల్లో ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు. అదే సంఖ్యలో వీక్షణలను కలిగి ఉన్నారు. అందువల్లే వారికి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్స్ అనే ట్యాగ్ లైన్ ఉంది. అయితే వారికి ఆ స్థాయిలో ఫాలోవర్స్, వ్యూ యర్ షిప్ రావడానికి ప్రధాన కారణం జెన్యూన్ కంటెంట్ కాదా.. వారంతా అడ్డదారులు తొక్కి ఫాలోవర్స్, వ్యూ యర్ షిప్ పెంచుకుంటున్నారా.. తద్వారా వివిధ సంస్థల నుంచి భారీగా డబ్బులు సంపాదిస్తున్నారా.. చివరికి యూట్యూబ్ ను కూడా మోసం చేస్తున్నారా.. అంటే ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానమే లభిస్తోంది.

Also Read : వీడు మామూలోడు కాదు.. తల్లీకూతుళ్ళను ఒకేసారి గర్భవతులను చేశాడు.. వైరల్ వీడియో

బయటపడిన సంచలన వీడియో

సాధారణంగా యూట్యూబ్లో ఎవరైనా ఛానల్ ఏర్పాటు చేసి ఫేమస్ అవడానికి చాలా కష్టపడతారు. జెన్యూన్ కంటెంట్ తో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. ఎవరూ చేయని ప్రయత్నాన్ని ఫాలోవర్స్ ముందు ఉంచుతారు. తద్వారా సోషల్ మీడియాలో తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంటారు. యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి సక్సెస్ అయిన వారి గురించి పై విధమైన అభిప్రాయమే చాలామందికి ఉండేది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో ప్రకారం..యూ ట్యూబ్ లో ఇన్ ఫ్లూయన్సర్లు గా ఉన్న వ్యక్తులు అడ్డదారులు తొక్కుతున్నారని.. సంపాదన కోసం వక్రమార్గాలు పడుతున్నారని.. తమకు లేని ఫాలోవర్స్ ను, లేని వ్యూయర్షిప్ ను చూపించడానికి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలియ వచ్చింది. సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో ప్రకారం వియత్నాం దేశంలో ఓ ప్రాంతంలో ప్రత్యేకంగా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వందలకొద్ది ఫోన్లు ఏర్పాటుచేసి..యూ ట్యూబ్ ను ఓపెన్ చేసి.. వారికి టార్గెటెడ్ చానల్స్ ను చూస్తూ.. వాటికి కామెంట్లు పెడుతున్నారు.. ఇదంతా కూడా యూట్యూబ్ లో ఫేమస్ అవ్వడానికి.. వ్యూయర్ షిప్ పెంచుకోవడానికి ఇలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. యూ ట్యూబ్ ను మోసం చేస్తూ ఇలాంటి దందాకు తెరలేపుతున్నారు. యూట్యూబ్ లో ఫేమస్ అవ్వడానికి ఇలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్న విధానాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలా కూడా చేస్తారా అంటూ షాక్ కు గురవుతున్నారు.. మొత్తంగా సోషల్ మీడియాలో ఫేమస్ చేయడానికి కూడా సంస్థలు ఏర్పాటయి.. ఇలా ఏకంగా ప్రత్యేకమైన కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం నిజంగా దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.

Also Read : యూట్యూబ్‌కు 20 ఏళ్లు.. సోషల్‌ ప్రపంచంలో డిజిటల్‌ విప్లవం!