MLAs and MLCs are getting injured
Andhra Pradesh : ఏపీలో( Andhra Pradesh) ప్రజా ప్రతినిధుల క్రీడా పోటీలు అపశృతికి దారితీస్తున్నాయి. వివిధ క్రీడా పోటీల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గాయాల పాలవుతున్నారు. ఆసుపత్రుల్లో చేరుతున్నారు. మూడు రోజుల కిందట విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఆటల పోటీలు ప్రారంభం అయ్యాయి. మంగళవారం సాయంత్రం అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ క్రీడా పోటీలను ప్రారంభించారు. ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు ఉత్సాహంగా ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేల అత్యుత్సాహం గాయాల పాలు చేసింది. ఆసుపత్రిలో చేరేలా చేసింది.
Also Read : 50 ఏళ్లకే పింఛన్.. మంత్రి కీలక ప్రకటన!
* కబడ్డీ ఆడుతూ
ప్రధానంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి( gorantla buchchayya Chaudhary)
కబడ్డీ ఆడుతూ తూలి కింద పడ్డారు. స్వల్ప గాయాలకు గురయ్యారు. ఏడు పదుల వయసులో ఉన్న ఆయన ఉత్సాహంగా కబడ్డీ ఆడారు కానీ.. గాయపడ్డారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సైతం కబడ్డీ ఆడుతూ జారిపడ్డారు. వెంటనే అక్కడ ఉన్న వైద్యులు ప్రధమ చికిత్స చేశారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు.
* క్రికెట్ ఆడుతూ..
క్రికెట్ ఆడుతూ సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్( Vijay Kumar) తీవ్రంగా గాయపడ్డారు. క్రికెట్ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ కింద పడిపోవడంతో ఆయన ముఖానికి గాయాలయ్యాయి. వెంటనే వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. కుట్లు వేయవలసి ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఎమ్మెల్సీ రామ్ భూపాల్ రెడ్డి సైతం క్రికెట్ ఆడుతూ గాయపడ్డారు. కిందకు పడడంతో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే తమ వయస్సు, స్థాయి మరిచి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు క్రీడా పోటీల్లో పాల్గొనడం మాత్రం గమనార్హం. అయితే సీనియర్ ఎమ్మెల్యేలు వరుస పెట్టి గాయాలు పాలు కావడం.. ఈ వయసులో ఈ పోటీ లేనిది రా బాబు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆటల్లో దిగి గాయాలకు గురికావడంపై సోషల్ మీడియా వేదికగా రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.
Also Read : అలర్ట్ ఏపీ.. రెండు రోజులు చాలా జాగ్రత్త.. బయటకు రాకపోవడమే బెటర్