Ilaiyaraaja: తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన అజిత్(Thala Ajith) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతం నడుస్తూ, కేవలం 5 రోజుల్లోనే 172 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది ఈ చిత్రం. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఇంకా కొన్ని రోజుల సమయం పడుతుంది. తమిళనాడు, ఓవర్సీస్ ప్రాంతాల్లో తప్ప ఈ చిత్రానికి మిగిలిన ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు కేవలం నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఈ ప్రాంతంలో నష్టాలు తప్పేలా లేవు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఇప్పుడు కొత్త సమస్యల్లో పడింది.
Also Read: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ని డబుల్ మార్జిన్ తో దాటేసిన ‘జాట్’..ఇదేమి రచ్చ సామీ!
ఈ చిత్రంలో కొన్ని పోరాట సన్నివేశాల్లో వింటేజ్ సాంగ్స్ ని ఉపయోగిస్తారు. అందులో మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా(ilayaraja) పాటలు కూడా ఉన్నాయి. అనుమతి లేకుండా తన పాత పాటలను వాడుకున్నందుకు ఇళయరాజా నిర్మాతలకు 5 కోట్ల రూపాయిల నష్టపరిహారాన్ని అడుగుతూ లీగల్ నోటీసులు జారీ చేసాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇళయరాజా గతంలో కూడా పలు సినిమాలకు ఇలాగే లీగల్ నోటీసులు జారీ చేశాడు. అయితే అజిత్ అభిమానులు కూడా దీనికి చాలా స్ట్రాంగ్ కౌంటర్లు వేస్తున్నారు. అసలు ఇళయరాజాకు ఏ హక్కు ఉందని లీగల్ నోటీసులు జారీ చేస్తాడు?, ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్ కి నిర్మాతలు డబ్బులు చెల్లిస్తారు. ఆయన కంపోజ్ చేసిన ఆల్బమ్ ని నిర్మాతలు ప్రముఖ మ్యూజిక్ కంపెనీలకు అమ్ముకుంటారు. మ్యూజిక్ రైట్స్ మొత్తం సదరు కంపెనీ వద్ద మాత్రమే ఉంటుంది.
వేస్తె వాళ్ళు కేసులు వెయ్యాలి, లీగల్ నోటీసులు జారీ చేయాలి, ఇళయరాజా కి ఏమి హక్కు ఉందని లీగల్ నోటీసులు పంపిస్తున్నాడు అంటూ అజిత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నిర్మాతలు కచ్చితంగా మ్యూజిక్ ని వాడుకోవాలని అనిపిస్తే, సదరు కంపెనీ కి డబ్బులు చెల్లించి రైట్స్ తీసుకొని ఉంటారని, లేకపోతే వాడుకునే ముందు వాళ్లకు ఒకసారి సమాచారం అందించే ఉంటారని, ఇళయరాజా కి ఇవన్నీ తెలియకపోవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో ఇళయరాజా కు సినిమాల్లో అవకాశాలు రావడం లేదు, ఆయన కొడుకు కూడా ఈమధ్య కాలంలో కనిపించడం లేదు, బహుశా ఆయనకు, ఆయన కుటుంబానికి ఆర్ధిక సమస్యలు ఉండడం వల్లే ఇలా లీగల్ నోటీసులు జారీ చేసి నష్టపరిహారం అడుగుతున్నది అజిత్ ఫ్యాన్స్ ట్విట్టర్ సాక్షిగా సెటైర్లు వేస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. నిర్మాతలు దీనికి ఎలా స్పందిస్తారో కూడా చూడాలి.
Also Read: ‘విశ్వంభర’ లో కేవలం ఆ ఒక్క పాట కోసం 6 కోట్లు ఖర్చు చేశారా..?