Chanakya Niti: అపర చాణక్యుడు రాజకీయ నీతి మాత్రమే కాకుండా మనుషుల జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలను చెప్పాడు. కొందరు తనకి నీతి ప్రకారం తమ జీవితాలను సక్రమ దారిలోనూ నడిపించుకుంటున్నారు. ఒక వ్యక్తి తన జీవితంలో అభివృద్ధి సాధించాలంటే డబ్బు చాలా అవసరం. అయితే ఈ డబ్బును ప్రణాళిక ప్రకారంగా ఖర్చు చేయాలి. అలాగే ఎక్కువ డబ్బు సంపాదించడానికి అదనంగా కష్టపడాలి. కానీ కొందరు ఎంత కష్టపడ్డా.. ఎన్ని పనులు చేసినా సరైన ఆదాయం ఉండదు. ఇలాంటి వారు ఇతరులను డబ్బు అప్పు అడుగుతుంటారు. అయితే ఇలాంటి సమయంలో సాయం చేయడం చాలా అవసరం. కానీ ఈ సాయం కొందరికి మాత్రమే చేయాలని కొందరికి మాత్రమే చేయాలని చాణిక్యనీతి తెలుపుతుంది. ఇలాంటి వారికి డబ్బు అస్సలు ఇవ్వకూడదని చాణక్య నీతి పేర్కొంటుంది. ఇంతకీ డబ్బు ఎవరికి ఇవ్వకూడదు అంటే?
Also Read: వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో ‘నువ్వు నాకు నచ్చావ్ 2’ చేయబోతున్నారా..?
కొందరి వద్ద ఆదాయం ఎక్కువగా నిలిచి ఉండదు. అయితే వారు కష్టపడిన ఆదాయం ఉండడం లేదా? లేక డబ్బురు దుబారాగా ఖర్చు చేస్తున్నారా? అనేది తెలుసుకోవాలి. ఇలాంటివారు డబ్బులు సరిపోక అప్పు అడిగితే అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే వీరు అప్పు తీసుకొని మళ్ళీ ఖర్చులు చేస్తూ ఉంటారు. తర్వాత తిరిగి ఇచ్చే ప్రయత్నం చేయరు. దీంతో వీరికి డబ్బు ఇచ్చిన వారు నష్టపోతారు. అందువల్ల ఇలాంటి వారి విషయంలో డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు అని చాణక్యనీతి తెలుపుతుంది.
అహంకారం కలిగిన వారికి డబ్బు ఎన్నడూ ఇవ్వకూడదు అని చాణిక్యనీధి తెలుపుతుంది. ఎందుకంటే వీరు అవసరం ఉన్నప్పుడు డబ్బులు అడుగుతారు. ఆ తర్వాత తిరిగి ఇవ్వమంటే గొడవ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా డబ్బులు ఇచ్చినవారినే అవమానాల పాలు చేసే అవకాశం ఉంది. అందువల్ల అహంకారంతో కూడిన వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వకూడదు. అలా ఇస్తే డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉండదు.
మాటలతో కోటలు కడతారు.. అనే సామెత వింటూనే ఉంటాం. అంటే కొందరు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఎదుటివారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాలు చేసి ఇతరుల వద్ద అప్పులు చేస్తూ ఉంటారు. ఇలా మితిమీరిన అప్పులు చేసి ఆ తర్వాత వారికి తిరిగి ఇవ్వరు. ఇలాంటి వారి గురించి ముందే తెలుసుకొని.. లేదా ఎక్కువగా మాట్లాడే వ్యక్తులకు డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే వీరు తిరిగి ఇవ్వమంటే ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. తమ మాటలతో ఎదుటివారిని ఆకట్టుకుంటామని వారు అనుకుంటూ ఉంటారు.
కొందరు ఎన్నో పనులు చేస్తారు. కానీ ఆత్మవిశ్వాసంతో కలిగి ఉండరు. ఎప్పుడూ ఏదో ఒక బాధ చెబుతూ కుంగిపోతుంటారు. ఇలాంటి వారికి డబ్బు ఇచ్చినా తిరిగి వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే వారు డబ్బు ఇవ్వమంటే ఏదో ఒక కారణం చెప్తూ తప్పించుకుంటారు. అందువల్ల ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే అత్యవసర పరిస్థితుల్లో లేదా కుటుంబ సభ్యుల కోసం అప్పులు అడిగే సమయంలో వారి పరిస్థితులను ఆధారంగా ఇవ్వొచ్చని చాణిక్యనీతి తెలుపుతుంది.