CPI Narayana comments on Pawan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై( Pawan Kalyan) ముప్పేట దాడి పెరుగుతోంది. ఒక రాష్ట్రం మనోభావాలను దెబ్బ తీసారని తెలంగాణ నేతలు విమర్శలు చేస్తుండగా.. స్వరాష్ట్రంలో సైతం విపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి. తాజాగా వామపక్షాలు సైతం ఎంటర్ అయ్యాయి. కానీ కూటమి నేతలు ఎవరు పవన్ కళ్యాణ్ కు అండగా నిలవడం లేదు. అయితే దీని వెనుక వ్యూహం ఉందా అన్నది ఒక అనుమానం. ఒకవేళ టిడిపి కూటమి స్పందించిన మరుక్షణం దీనిని సెంటిమెంట్ అస్త్రంగా మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే కూటమి నేతలు వ్యూహాత్మకంగా సైలెంట్ పాటిస్తున్నారు. చివరకు జనసేన నుంచి కూడా ఆశించిన స్థాయిలో స్పందన లేదు. దీని వెనుక ఆదేశాలు ఉన్నట్లు సమాచారం.
దిష్టి అనే వ్యాఖ్యలపై..
వారం రోజుల కిందట అంబేద్కర్ కోనసీమ( Ambedkar konasima) జిల్లా పర్యటనకు వెళ్లారు పవన్. సముద్రం నుంచి పోటెత్తుతున్న ఉప్పునీటితో కొబ్బరి పంటలకు నష్టం వాటిల్లుతోంది. కోనసీమ కాస్త కళావిహీనంగా మారుతుంది. అయితే ఎప్పుడు కోనసీమ మాదిరిగా పంటలు పై అంతకుముందు తెలంగాణ నేతలు మాట్లాడేవారు. తమ రాష్ట్రంలో సైతం ఆ దిశగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించేవారు. అయితే ప్రతి ఇంట్లో.. సర్వసాధారణంగా మాట్లాడే దిష్టి అనే పదాన్ని ఉపయోగించారు పవన్. గతంలో ఏపీ ప్రజలను తిట్టే నేతలు కోనసీమ జిల్లాలను ఉదహరించి మాట్లాడేవారు. ఈ నేపథ్యంలో తెలంగాణ దిష్టి తగిలిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే అక్కడకు నాలుగు రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు స్పందించారు. కొద్దిరోజులకే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పవన్ కళ్యాణ్ సినిమాలను నిలిపివేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అది మొదలు తెలంగాణ నేతలు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే జనసేన కార్యాలయం నుంచి ఒక నోటు రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ మాటలను వక్రీకరించారు అంటూ దాని సారాంశం. దీంతో అక్కడి నుంచి విమర్శలకు ఫుల్ స్టాప్ పడుతుందని అంతా భావించారు.
మంత్రివర్గం నుంచి తొలగించాలని..
తాజాగా సిపిఐ నారాయణ( CPI Narayana) దీనిపై స్పందించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని రేపేలా ఉన్నాయని అభివర్ణించారు. ఆయన డిప్యూటీ సీఎం గా అనర్హుడని తేల్చేశారు. మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే కూటమి విషయంలో సానుకూలంగా ఉండే నారాయణ పవన్ విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉంటారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఇదే వామపక్షాలతో కలిసి పవన్ నడిచారు. ఓడిపోయిన తర్వాత బిజెపి సరసన చేరారు. అది మొదలు వామపక్షాల నేతలు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. తెలంగాణ నేతలు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్న వేళ నారాయణ సైతం శ్రుతి కలిపారు.