Nani comment on Pawan movies: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ( YSR Congress )ఇంకా గుణపాఠాలు నేర్చుకోలేదు. పవన్ కళ్యాణ్ కొట్టిన దెబ్బను ఇంకా మరిచిపోలేదు. అయినా సరే వారి వెటకారానికి అంతే లేకుండా పోతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాలపై మాట్లాడారు పేర్ని నాని. పవన్ ఏదో ఆదరణ లేని నటుడు అన్నట్టు మాట్లాడారు. ఆయన సినిమాలు ఒకటి రెండు షోలతో ముగిస్తున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ వల్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికి దిగజారిందో తెలియదు కాదు. అయినా అనవసరంగా ఆయనను కెలుకుతున్నారు. ఆయన సినిమాల విషయంలో సైతం మాట్లాడుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటే మంచిది. సమకాలీన అంశాలపై ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ప్రకాష్ రాజ్ కలుగ చేసుకుంటే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది తప్పదు.
మరింత వివాదాస్పదంగా..
అంబేద్కర్ కోనసీమ( Ambedkar konasima ) జిల్లాలో పర్యటన సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కోనసీమలో కొబ్బరి తోటలు నాశనం కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో తెలంగాణ దిష్టి తగిలిందేమో అని అర్థం వచ్చేలా మాట్లాడారు. ఆయన పాజిటివ్ గానే మాట్లాడారు కానీ.. దానిని వ్యతిరేకంగా తీసుకుని తెలంగాణ నేతలు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పవన్ కళ్యాణ్ క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. లేకుంటే సినిమాలు ఆపేస్తామని హెచ్చరించారు. దీనిపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఆయన ఎవరయ్యా బాబు సినిమాటోగ్రఫీ మంత్రి అంట. మీరెందుకు పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపాలి. ఆ సినిమాలు ఇలా విడుదలై మ్యాట్నీ తో ముగుస్తున్నాయి. సినిమాలను కొనుగోలు చేస్తున్న వారితో పాటు టికెట్ కొంటున్న వారు నిరాశ చెందుతున్నారు అంటూ వెటకారంగా మాట్లాడారు. ప్రస్తుతం పేర్ని నాని కామెంట్స్ పై జనసైనికులు మండిపడుతున్నారు.
అప్పట్లో అలా..
అయితే గతంలో కూడా తెలుగు సినీ పరిశ్రమలో( Telugu cinema industry) రేగిన విభాగంలో పవన్ ప్రస్తావన వచ్చింది. మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు పై ప్రకాష్ రాజ్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రకాష్ రాజ్ కు మెగా కుటుంబం అండగా నిలిచింది. ఈ క్రమంలో ఒకసారి పవన్ ప్రస్తావన వచ్చేసరికి ప్రకాష్ రాజ్ ఘాటుగా హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ సినిమా మార్నింగ్ షోకు వచ్చిన బడ్జెట్ నీ చిత్రానికి ఉండదు అంటూ ప్రకాష్ రాజ్ గట్టిగా నే హెచ్చరించారు. అయితే ఇటీవల రాజకీయపరంగా పవన్ కళ్యాణ్ తో ప్రకాష్ రాజ్ విభేదించవచ్చు కానీ.. వారి మధ్య సినిమా పరంగా మంచి స్నేహం ఉంది. ఒకవేళ పేర్ని నాని వ్యాఖ్యలు ప్రకాష్ రాజ్ వరకు వెళ్తే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దబిడ దిబిడే. ప్రకాష్ రాజ్ గతం మాదిరిగా స్పందించే అవకాశం ఉంటుంది కూడా. ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ కంటే సీనియర్ నటుడు. అతి దగ్గర నుంచి చూసిన వ్యక్తి కూడా. అటువంటి వ్యక్తి గతంలో చేసిన కామెంట్ ను వైసీపీ నేతలు గుర్తుపెట్టుకుంటే మంచిది. లేకుంటే ప్రకాష్ రాజ్ లాంటి నటుడు ఎంటర్ అయితే ఇంకోలా ఉంటుంది. 2024 ఎన్నికల కు ముందు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఇలానే అవమానించారు. కానీ మొరగని కుక్క అంటూ ఆయన చేసిన డైలాగ్ ఎంతలా వైరల్ అయిందో తెలియంది కాదు. తెలుగు నాట వైసీపీకి ఎంత డ్యామేజ్ చేసిందో తెలియదు కాదు. అందుకే పేర్ని నాని లాంటి నేతలు పవన్ కళ్యాణ్ సినిమాలపై విమర్శలు మానుకుంటే మంచిది.