Congress gives shock Sharmila: ఏపీ పై కాంగ్రెస్ హై కమాండ్ ( Congress High Command ) దృష్టి పెట్టిందా? రాష్ట్రంలో పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నం జరుగుతోందా? షర్మిలను ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ తీయాలని భావిస్తున్నారా? వైసీపీని బలహీనపరిచి ఆ స్థానంలోకి రావాలని కాంగ్రెస్ చూస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఇకనుంచి సీనియర్ల సేవలను వినియోగించుకుని పార్టీని బలోపేతం చేయాలని వైసిపి హై కమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పార్టీకి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు రావడంతో పాటు ఓ పాతికమంది సీనియర్లతో జంబో కమిటీని ఏర్పాటు చేశారు. షర్మిల సేవలను విస్తృతంగా వాడుకోవడం ద్వారా.. ఆమెను ఈ నాలుగేళ్ల పాటు ప్రజల్లో ఉంచడం ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. తద్వారా ఏపీలో కాంగ్రెస్ బలం పెంచాలని భావిస్తోంది.
Read Also: తగ్గేదేలే.. ట్రంప్ కు కౌంటర్ ఇచ్చిన మోడీ..
సీనియర్లు దూరం..
ఎన్నికలకు ముందు పిసిసి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు షర్మిల( Sharmila). ఆమె సీనియర్లను కలుపుకొని వెళ్లడం లేదన్న విమర్శ ఉంది. అదే సమయంలో సీనియర్లు సైతం ఆమెకు సహకారం అందించడం లేదన్న ఆరోపణ కూడా ఉంది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏపీ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చింది. పిసిసి చీఫ్ గా షర్మిలను కొనసాగిస్తూనే.. వర్కింగ్ ప్రెసిడెంట్గా కేంద్ర మాజీ మంత్రి జెడి శీలం, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీలను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఓ 25 మందితో కూడిన పొలిటికల్ అడ్వైజరీ కమిటీని కూడా నియమించింది కాంగ్రెస్. వారిని కలుపుకొని ముందుకెళ్లాలని పిసిసి చీఫ్ నకు ఆదేశించింది హై కమాండ్.
పీఏసీలో 25 మందికి చోటు..
కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో ఓ 25 మందికి చోటు దక్కింది. ఈ కమిటీకి చైర్మన్గా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణికం ఠాగూర్( Manikam Tagore ) ఉంటారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిల, పిసిసి మాజీ చీఫ్ రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, చింతా మోహన్, జెడి శీలం, కిల్లి కృపారాణి వంటి వారికి చోటు కల్పించారు. వీరితో పాటు కేవీపీ రామచంద్రరావు, జిబి హర్ష కుమార్, తులసి రెడ్డి వంటి సీనియర్లు కూడా ఈ కమిటీలో ఉంటారు. షర్మిలను ముందు పెట్టి పార్టీని నడిపించే బాధ్యత వీరికి అప్పగించనున్నారు. ఇకనుంచి కాంగ్రెస్ పార్టీలో విధానపరమైన నిర్ణయాలు ఈ కమిటీ తీసుకొనుంది.
Read Also: ప్రముఖ హాట్ హీరోయిన్ పై పోలీస్ కేసు..ఇండస్ట్రీ మొత్తం షాక్!
ఉత్త ప్రచారమే..
షర్మిల నాయకత్వ బాధ్యతలు మారుస్తారని అంతా ప్రచారం నడిచింది. అయితే అందులో ఎంత మాత్రం నిజం లేదని తేలిపోయింది. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అయితే ఆ పార్టీ నుంచి చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయారు. అవకాశం లేని చాలామంది నేతలు అదే పార్టీలో కొనసాగుతున్నారు. వారంతా సైలెంట్ గా ఉన్నారు. అందుకే షర్మిల కు సహకారం అందించి పార్టీని బలోపేతం చేస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు చూస్తారన్నది ఒక అంచనా. అందుకే ఉత్తరాంధ్రకు చెందిన ఓ మాజీ మంత్రి, రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ బలమైన వ్యక్తిని పార్టీలోకి రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. అయితే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీలో ఉన్న బలమైన నేతలు కొంతమందిని కాంగ్రెస్ లోకి రప్పించగలిగితే మాత్రం.. ఆ పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయం. కానీ ఆ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.