Venu Swamy: వేణు స్వామితో వైసీపీలో కలవరం

Venu Swamy: సినీ సెలబ్రిటీలకు జోష్యం చెప్పడం ద్వారా వేణు స్వామి ఫేమస్ అయ్యారు.నాగచైతన్య సమంత విడిపోతారని వేణు స్వామి చెప్పిన జోష్యం ఫలించింది. అక్కడినుంచి విపరీతంగా ఫేమస్ అయ్యారు వేణు స్వామి.

Written By: Dharma, Updated On : May 27, 2024 5:56 pm

Confusion in YCP with Venu Swamy

Follow us on

Venu Swamy: జాతకం అంటే విశ్వాసం.. జాతకం అంటే నమ్మకం. అయితే ఈ విశ్వాసాలు, నమ్మకాలు పక్కకు వెళ్లిపోయాయి. ఇప్పుడు జాతకం, జోష్యం అంటే ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. ముఖ్యంగా సెలబ్రిటీల జాతకాలు, జోష్యాలు చెప్పే వేణుస్వామి లాంటివారు ఎంట్రీ తర్వాత పూర్తిగా సీన్ మారిపోయింది. తెలంగాణలో కేసీఆర్(KCR) గెలుస్తాడని వేణు స్వామి చెప్పారు. ఆయన గెలవలేదు. రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి సీఎం యోగ్యత లేదని ఇదే వేణుస్వామి చెప్పారు. ఏకంగా రేవంత్ సీఎం అయ్యారు. 8 నెలల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఐపీఎల్ లో హైదరాబాద్ గెలుపు పొందుతుందని జోష్యం చెప్పారు. కానీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. ఇదే ఇప్పుడు వైసీపీ(YCP) శ్రేణుల ఆందోళనకు కారణం అవుతోంది. గత రెండు సంవత్సరాలుగా సీఎం జగన్(CM Jagan) మరోసారి గెలుస్తారని వేణు స్వామి చెప్పడమే కారణం.

సినీ సెలబ్రిటీలకు జోష్యం చెప్పడం ద్వారా వేణు స్వామి ఫేమస్ అయ్యారు.నాగచైతన్య సమంత విడిపోతారని వేణు స్వామి చెప్పిన జోష్యం ఫలించింది. అక్కడినుంచి విపరీతంగా ఫేమస్ అయ్యారు వేణు స్వామి. ఏ చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టలేదు. రాజకీయ సినీ ప్రముఖులకు సంబంధించి దృశ్యాలు చెబుతూ ఆన్లైన్లో హల్చల్ చేయడం ప్రారంభించారు. కొద్దిరోజుల కిందట ఏపీ సీఎం జగన్ ను ప్రత్యేకంగా కలిశారు. అక్కడ నుంచి తన స్వరాన్ని మరింత పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఫలితాలు వస్తాయనగా మరోసారి జోష్యం చెప్పారు.

అయితే జగన్ గెలుస్తారని చెప్పిన వేణు స్వామి.. ఐపీఎల్ టోర్నీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు. కానీజట్టు ఓడిపోయింది.ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది.అక్కడి నుంచి వేణు స్వామి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయినప్పుడు కూడా ఇదే మాదిరిగా వేణు స్వామి సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యారు. వేణు స్వామి బాధ అటుంచితే.. వైసీపీ శ్రేణులు మాత్రం చాలా ఆందోళనతో గడుపుతున్నాయి. గత ఆరు నెలలుగా వేణు స్వామి చెప్పిన ఒక్క జోష్యం కూడా ఫలించలేదు. ఏపీలో జగన్ పదేపదే గెలుస్తారని.. 2029 ఎన్నికల్లో కూడా ఆయనే అధికారంలోకి వస్తారని.. 17 సంవత్సరాల పాటు నిరంతరంగా ఈ రాష్ట్రానికి సీఎంగా కొనసాగుతారని వేణు స్వామి జోష్యం చెప్పారు. వేణు స్వామి టార్గెట్గా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడంతో.. జగన్ విషయంలో కూడా ఆయన జోష్యం ఫెయిల్ అవుతుందని ఎక్కువమంది కామెంట్లు పెడుతున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవు.. జోష్యాలకు ఓట్లు రామంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. దీంతో వైసిపి శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.

AP Elections 2024: ఏపీలో సేమ్ సీన్.. నాడు టిడిపి, నేడు వైసిపి

Jagan: జగన్ కు ఢిల్లీ నుంచి మైండ్ బ్లోయింగ్ ఆఫర్