Chandrababu: ఆ విషయంలో చంద్రబాబుకు జై కొడుతున్న వైసిపి

Chandrababu: వైసీపీ నేతలు గత ఐదు సంవత్సరాలుగా చంద్రబాబును అవహేళన చేస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలని సవాల్ చేశారు. బిజెపితో పొత్తు పెట్టుకోవడాన్ని తప్పుపట్టారు.

Written By: Dharma, Updated On : May 27, 2024 6:20 pm

YCP is cheering for Chandrababu in that regard

Follow us on

Chandrababu: రాజకీయ నేతల మాటలకు అర్ధాలు వేరేలా ఉంటాయి. వారి మాటలను బట్టి మనం ఒక నిర్ణయానికి రావచ్చు. ఏపీ రాజకీయాలనే(AP Politics) తీసుకుందాం. ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసిపి(YCP) ఆరోపిస్తోంది. మరో అడుగు ముందుకేసి చంద్రబాబు, పురందేశ్వరి(Purandeswari) సూచనల మేరకే ఎలక్షన్ కమిషన్ నడుచుకుందని వైసీపీ నేతలు ఆరోపించడం ప్రారంభించారు. అంటే ఈ లెక్కన చంద్రబాబు ఆలోచన పని చేసినట్టే కదా? బీజేపీతో(BJP) పొత్తు పెట్టుకోవడం వల్లేఎన్నికల విషయంలో చంద్రబాబుకు సహకారం లభించడం నిజమే కదా?

వైసీపీ నేతలు గత ఐదు సంవత్సరాలుగా చంద్రబాబును అవహేళన చేస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలని సవాల్ చేశారు. బిజెపితో పొత్తు పెట్టుకోవడాన్ని తప్పుపట్టారు. టిడిపి తో బిజెపి కలిసి రాదని కూడా ప్రచారం చేశారు. టిడిపి తో బిజెపి కలవకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఇవేవీ చంద్రబాబు పట్టించుకోలేదు. సొంత పార్టీ నేతలు వద్దని చెప్పినా వినలేదు. బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. ఎన్నికల నిర్వహణపరంగా తాను అనుకున్న ప్రయోజనాన్ని దక్కించుకున్నారు.

బిజెపితో పొత్తు లేకుంటే.. ఏపీలో ఎన్నికలు సజావుగా జరిగేవా? వైసీపీకి ఏకపక్షంగా సాయం అందేది కదా? ఎన్నికల కమిషన్ కఠినంగా ఉన్న సమయంలోనే.. ఏపీవ్యాప్తంగా అల్లర్లు జరిగాయి. పోలింగ్ నాడు, పోలింగ్ ముగిసిన తరువాత కూడా విధ్వంసాలు జరిగాయి. కేవలం అధికారుల మార్పు చోటు చేసుకున్న ప్రాంతాల్లోనే ఈ అల్లర్లు జరిగాయి. అయితే టిడిపి ఒకలా భావిస్తోంది. వైసిపి వేరేలా ఆరోపణలు చేస్తోంది. కేవలం అల్లర్లు సృష్టించేందుకే అధికారులను అక్కడి నుంచి మార్చారని వైసిపి ఆరోపిస్తోంది. అయితే సహకరించే అధికారులు వెళ్లిపోవడంతో.. సహనం కోల్పోయి వైసిపి విధ్వంసానికి పాల్పడిందని టిడిపి ఆరోపిస్తోంది. అయితే వైసీపీ నేతలు చంద్రబాబుతో పాటు పురందేశ్వరి సూచనల మేరకు ఎలక్షన్ కమిషన్ నడుచుకుందని చెప్పడం మాత్రం ఆలోచించాల్సిన విషయం. అంటే చంద్రబాబు బిజెపితో పొత్తు పెట్టుకోవడం ద్వారా.. ఎన్నికల క్యాంపెయిన్ ను బాగా చేసుకున్నారన్నది వైసిపి ఆందోళన. ఇది స్పష్టంగా వారి ప్రకటనల్లో కనిపిస్తోంది. వారి ముఖంలో చేజారిపోయిన గెలుపు ధీమాలో దర్శనమిస్తోంది. మొత్తానికైతే బిజెపితో జత కలిసి చంద్రబాబు తాను అనుకున్నది సాధించుకున్నారన్నది వైసీపీ నేతల నుంచి వస్తున్న మాట. కానీ గెలుపు విషయానికి వచ్చేసరికి మాత్రంవై నాట్ 175 అన్న నినాదం వదలడం లేదు. అది కూడా అత్యంత ఆశ్చర్యకరమే.

Jagan: జగన్ కు ఢిల్లీ నుంచి మైండ్ బ్లోయింగ్ ఆఫర్

Venu Swamy: వేణు స్వామితో వైసీపీలో కలవరం