ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈనెల 8న విశాఖ రానున్నారు. ఏపీ సీఎం గా చంద్రబాబు ప్రమాణస్వీకారం కార్యక్రమానికి మోడీ హాజరయ్యారు. అటు తరువాత ఏపీకి రావడం ఇదే తొలిసారి. ఏపీలో ప్రధాని పర్యటనకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు అయ్యింది. లక్ష కోట్ల పెట్టుబడులకు సంబంధించి శంకుస్థాపనలు చేయనున్నారు మోదీ. అలాగే నగరంలో రోడ్ షో కూడా ప్లాన్ చేశారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ జరగనుంది. ఏపీకి సంబంధించి ప్రధాని మోదీ కీలక ప్రకటనలు చేస్తారని అంచనాలు ఉన్నాయి. సాయంత్రం 4:15 గంటలకు విశాఖలోని ఐఎన్ఎస్ డేగాలో దిగుతారు. ఈ సందర్భంగా ప్రధానికి రాష్ట్ర గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర ప్రముఖులు స్వాగతం పలుకుతారు. ఈ సందర్భంగా నేవీ నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరిస్తారు. అటు తరువాత అక్కడ నుంచి రోడ్ షో బహిరంగ సభ వేదికకు చేరుకోనున్నారు ప్రధాని మోదీ. ప్రధాని పర్యటనకు సంబంధించి ఇన్చార్జిగా మంత్రి నారా లోకేష్ వ్యవహరించనున్నారు.
* ఓపెన్ టాప్ జీపుపై..
నగరంలోని ప్రధాన జంక్షన్ లను కలుపుతూ మోడీ పర్యటన కొనసాగనుంది. తాటి చెట్ల పాలెం జంక్షన్, సంపత్ వినాయక్ గుడి, దత్త ఐలాండ్ మీదుగా.. ఏయూ ఎకనామిక్స్ విభాగం ఎదురుగా ఉన్న వెంకటాద్రి వంటిల్లు వరకు.. రోడ్డు షోలో పాల్గొంటారు ప్రధాని మోదీ. ఓపెన్ టాప్ వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ సాగుతారు. త్రీ టౌన్ జంక్షన్ మీదుగా ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానానికి చేరుకుంటారు.
* ప్రధానితో పాటు ఆ ఇద్దరు
కాగా ఈ రోడ్డు షోకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఓపెన్ టాప్ వాహనంపై ప్రధాని మోదీ తో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సైతం పాల్గొనే అవకాశం ఉంది. సాయంత్రం 5:30 నుంచి 6:30 గంటల వరకు ప్రధాని సభా ప్రాంగణంలోనే ఉంటారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. సాయంత్రం 6:30 గంటలకు సభ ముగిసిన తరువాత రోడ్డు మార్గాన ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. కాగా ఇది పూర్తి అధికారిక పర్యటన. రాజకీయ ప్రసంగాలు ఉండవని తెలుస్తోంది.
* కీలక ప్రాజెక్టులకు మోక్షం
ప్రధాని పర్యటన వేళ ఏపీకి సంబంధించి చాలా రకాల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ సానుకూలత వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అమరావతి తో పాటు పోలవరం అంశాల్లో కేంద్రం సాయం ప్రకటించింది. అయితే పెండింగ్ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా విశాఖ స్టీల్ అంశం పెండింగ్లో ఉంది. దీనిపై ప్రధాని మోదీ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రధాని పర్యటనపై అంత ఉత్కంఠ కొనసాగుతోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Complete details of prime minister modis tour in ap
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com