YSR Jayanthi: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్‌ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమం సందర్భంగా జగన్ ఎమోషనల్ అయ్యారు.ఈ ప్రత్యేక సందర్భంలో, తల్లి వై.ఎస్. విజయమ్మతో గతంలో విభేదాలు ఉన్నప్పటికీ, ఆమెను ఆత్మీయంగా పక్కనే ఉంచుకొని, సాదరంగా కౌగిలించుకొని వెంట తీసుకెళ్లడం అందరినీ ఆకట్టుకుంది. కుటుంబ బంధాలకు ఇచ్చిన ప్రాధాన్యతను ఇది స్పష్టం చేసింది.
View this post on Instagram
తండ్రి సమాధి వద్ద పూలు అమర్చి, అక్కడే కాసేపు కూర్చుని జగన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “నాన్న.. మళ్లీ రావా?” అంటూ ఆయన మనసులో కోరుకున్నట్లు తెలుస్తోంది. ఈ హృదయ విదారక దృశ్యం అక్కడున్న వారందరినీ కదిలించింది. వైయస్‌ఆర్ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, తండ్రి లేని లోటును జగన్ తీవ్రంగా ఫీలైనట్లు కనిపించింది.
ప్రతి సంవత్సరం వైయస్‌ఆర్ జయంతిని వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈసారి కూడా తమ ప్రియతమ నాయకుడిని గుర్తుచేసుకుంటూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని వైయస్‌ఆర్ కాంగ్రెస్ శ్రేణులు ప్రతిన బూనాయి.
వైయస్‌ఆర్ గారి 76వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్‌ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి @ysjagan గారు నివాళులు#LegendaryYSRJayanthi#YSRLivesOn pic.twitter.com/wmeMO6349R
— YSR Congress Party (@YSRCParty) July 8, 2025