Free Gas Scheme : ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది.వీలైనంత త్వరగా వాటిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది.అందులో భాగంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీకి కసరత్తు ప్రారంభించింది. ఈ ఉచిత పథకానికి సంబంధించి విపరీతంగా కసరత్తు చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఈ హామీ అమలుకు ఇప్పుడు సన్నాహాలు ప్రారంభించారు.అయితే ఈ పథకం అమలు చేయడం అంత సులువు కాదు. చాలా భారంతో కూడుకున్న పని. అందుకే చంద్రబాబు సర్కార్ సరికొత్త ప్లాన్ అమలు చేస్తోంది.ఆన్లైన్లో దరఖాస్తు విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.ఆధార్, రేషన్ కార్డ్ వంటి వాటిని ప్రామాణికంగా తీసుకోనున్నట్లు సమాచారం. అల్పాదయ వర్గాలతో పాటు స్థానికంగా నివాసం ఉండే వారికి మాత్రమే ఈ పథకం వర్తించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నవారి కి రిజెక్ట్ చేసే అవకాశం ఉంది.పథకాన్ని పూర్తిగా పారదర్శకంగా అమలు చేయాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది.
* ఆర్థికంగా భారమే
ప్రస్తుతం ఒక్కో గ్యాస్ సిలిండర్ ధర 800 వరకు ఉంది.మూడు సిలిండర్లు కలిపి 2400 వందల రూపాయలు అవుతుంది.ఒక్క కుటుంబానికి ప్రామాణికంగా తీసుకున్నా ఇది పెద్ద మొత్తమే.అందుకే సరికొత్త మార్గదర్శకాలతో ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.కొత్తగా రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.వైసిపి ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా రేషన్ కార్డులను మంజూరు చేశారు.రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం భారీ స్థాయిలో ఈ పథకం అమలు చేయాల్సి ఉంటుంది.అందుకే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకొని.. ఆధార్, రేషన్ కార్డు ప్రామాణికంగా మాత్రమే పథకానికి అర్హులను ఎంపిక చేయనున్నారు.
* విద్యుత్ బిల్లులను పరిగణలోకి..
గ్యాస్ సిలిండర్ పథకానికి విద్యుత్ బిల్లులతో షాక్ కొట్టించనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా చాలామంది ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తారు. అటువంటివారు ఎక్కువ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అటువంటి వారినంత అనర్హులుగా చూపించే అవకాశం ఉంది. మరోవైపు ఆధార్ నంబర్ ద్వారా లబ్ధిదారుని ఆదాయ వ్యాయాలు, ఇతరత్రా అంశాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా గ్యాస్ సిలిండర్ల పథకానికి భారీగా లబ్ధిదారులను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరి ప్రభుత్వ సంకల్పం ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి.