Homeఅంతర్జాతీయంDonald Trump : ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ట్రంప్ భారత్ పై బురద.. మరోసారి నోరుజారిన...

Donald Trump : ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ట్రంప్ భారత్ పై బురద.. మరోసారి నోరుజారిన నేత..

Donald Trump :  అమెరికాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష పోటీదారుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై నోరు పారేసుకోవడం మొదలు పెట్టారు. సుంకాల అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చి భారత్ పై మండిపడ్డారు. భారత్‌ అధికంగా పన్ను విధిస్తోందన్నారు. తాను అధికారంలోకి వస్తే భారతదేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై పన్నులు విధిస్తానని చెప్పారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై చైనా 200 శాతం పన్నులు విధిస్తోందని, బ్రెజిల్‌ టారిఫ్‌లు కూడా ఇలాగే ఉన్నాయని ట్రంప్‌ అన్నారు. ‘రెసిప్రొసిటీ (పరస్పర ప్రయోజనం కోసం వస్తువుల మార్పిడి)తో అమెరికాను అసాధారణ స్థాయిలో సుసంపన్నంగా మార్చాలనేదే ముఖ్యమైన అంశం. అమెరికా సాధారణంగా ఈ టారిఫ్‌లు వసూలు చేయదు కాబట్టి నా ప్లాన్‌లో ఇది ముఖ్యమైన పదం. నేను ఆ ప్రక్రియను మొదలుపెట్టాలనుకుంటున్నాను. చైనా 200 పర్సెంట్ టారీఫ్‌ను వసూలు చేస్తోంది. బ్రెజిల్ విషయంలో పరిస్థితి ఇంకా అలాగే ఉంది. ఈ దేశాలన్నింటికంటే భారత్‌ అధికంగా సుంకాలు వసూలు చేస్తోంది. భారత్‌తో అమెరికాకు మంచి సంబంధాలున్నాయి. మోడీ గొప్ప నాయకుడు, గొప్ప వ్యక్తి’ అని ఒకవైపు భారత్‌తో సంబంధాల గురించి పొగుడుతూనే సుంకాల గురించి మాట్లాడారు. ఇంధన ధరల గురించి ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించారు. ‘రానున్న ఏడాదిలో ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ ధరలను తగ్గిస్తా. విద్యుత్ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తా. ద్రవ్యోల్బణం బాగా తగ్గుతుంది. ఈ చర్యలతో అమెరికా మరీ ముఖ్యంగా మిచిగాన్‌లో వ్యాపార అవకాశాలు పెరుగుతాయి.’ అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

2019లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్న సమయంలో భారత్‌ను ‘టారిఫ్‌ కింగ్‌’ అని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్‌కు జీఎస్‌పీ (జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌) రద్దు చేశారు. ఈ హోదాతో భారత మార్కెట్లలోకి సమాన, హేతుబద్ధ సంధానత లభించలేదని ట్రంప్ ఆరోపించారు. జీఎస్‌పీ కింద అమెరికాకు అర్హత గల అభివృద్ధి చెందుతున్న దేశాలు సుంకం రహిత ఎగుమతులు చసే వీలుంటుందని చెప్పారు.

‘మన ఉత్పత్తులకు భారత్‌ 200 శాతం పన్ను వసూలు చేస్తుంటే మనం మాత్రం వారి ఉత్పత్తులకు ఎలాంటి పన్నులు విధించకూడదా.. ఇది సరికాదు. మనం పన్ను కడితే.. వారి నుంచి వసూలు చేయాల్సిందే. 2024 అధ్యక్ష ఎన్నికల్లో నేను అధికారంలోకి వస్తే.. భారత్‌పై పరస్పర సమానమైన ప్రతీకార పన్ను విధిస్తాను’ అని ట్రంప్‌ గతంలో హెచ్చరించారు.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version