CM Chandrababu : వైఫల్యాల నుంచి గుణపాఠాలను నేర్చుకోవాలి. అది ఏ రంగంలో వారికైనా వర్తిస్తుంది కూడా. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ విషయంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకసారి దాని నుంచి మూల్యం చెల్లించుకున్నప్పుడు.. చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఇప్పుడు చంద్రబాబు( CM Chandrababu) చేస్తోంది అది. 2014 నుంచి 2019 మధ్య టిడిపి ప్రభుత్వం పై వైసీపీ విష ప్రచారం చేసింది. అలా అవకాశం ఇచ్చింది కూడా టిడిపి సర్కార్. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు జాగ్రత్త పడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా పావులు కదుపుతున్నారు.
Also Read : అమరావతి విషయంలో చంద్రబాబును భయపెడుతున్న ఆంధ్రజ్యోతి ఆర్కే!
* అమరావతికి కొత్త కళ
చంద్రబాబు అధికారంలోకి వచ్చింది మొదలు అమరావతి పై ఫుల్ ఫోకస్ పెట్టారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకాభిప్రాయంతో అమరావతి రాజధానిని( Amravati capital ) ఎంపిక చేశారు. అయితే పనులు పూర్తి చేయడం విషయంలో జాప్యం జరిగింది. దానిని ప్రచార అస్త్రంగా మార్చుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈసారి అధికారం మొదట్లోనే అన్ని రకాల ప్రయత్నాలు చేసి మరి రాజధానికి ఒక రాచబాటను ఏర్పాటు చేశారు సీఎం చంద్రబాబు. మూడేళ్లలో అమరావతి కి తుది రూపు తేవాలని భావిస్తున్నారు. అదే సమయంలో అమరావతి పైనే కేవలం కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టి.. మిగతా ప్రాంతాలను విస్మరించిందని విమర్శ రాకుండా కూడా జాగ్రత్త పడుతున్నారు. అమరావతిని అప్పులు చేసి కడుతున్నారని విపక్షం ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. మిగతా అన్ని ప్రాంతాల ప్రజల్లో భిన్నాభిప్రాయాలు రాకుండా.. అన్ని ప్రాంతాలను ఏకకాలంలో అభివృద్ధి చేయాలని చూస్తున్నారు.
* నాలుగు ప్రాంతాలను సమానంగా..
రాష్ట్రంలో నాలుగు ప్రాంతాలు ఉన్నాయి. ఉత్తర కోస్తా, ఉభయగోదావరి, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలు ఉన్నాయి. ఈ నాలుగు ప్రాంతాలను సమ ప్రాధాన్యమిచ్చి అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే దక్షిణ కోస్తాకు సంబంధించి రాజధాని నిర్మాణం ప్రారంభమైంది. దానికి దగ్గరగా ఉంటాయి ఉభయ గోదావరి జిల్లాలు. ఆ రెండు జిల్లాలను పర్యాటకంతో పాటు వ్యవసాయపరంగా అభివృద్ధి చేయాలని ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు. ఇప్పటికీ అక్కడ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సైతం సాయం చేస్తోంది. ఇదే విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వెన్నుదన్నుగా నిలుస్తామని చెప్పుకొచ్చారు.
* ఉత్తరాంధ్ర పై ఫోకస్..
ప్రధానంగా చంద్రబాబు ఉత్తరాంధ్ర పై( North Andhra) ఫోకస్ పెట్టారు. విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఐటీ సంస్థలు విశాఖకు క్యూ కడుతున్నాయి. పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. మరోవైపు విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందని ఆశాభావంతో ఉన్నారు. మరో గ్రూప్ ఇంజన్ గా మారుతుందని లెక్కలు వేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కోర్టులతో పాటు జట్టిల నిర్మాణానికి నిర్ణయించారు. ఉభయగోదావరి జిల్లాల్లో వ్యవసాయంగా, పర్యాటకపరంగా మరింత ఊతమిచ్చే చర్యలు ప్రారంభించారు.
Also Read : అందుకే సింహాచలం వెళ్ళని సీఎం చంద్రబాబు!
* రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక..
మరోవైపు రాయలసీమ( Rayalaseema ) అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది కూటమి ప్రభుత్వం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అన్ని రకాల కసరత్తు చేస్తోంది. మరోవైపు పారిశ్రామిక వాతావరణాన్ని తీసుకుని రావడం ద్వారా అభివృద్ధి చేయాలని చూస్తోంది. రాయలసీమలో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరారు. తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దడంతో పాటు అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తే.. మరో గ్రోత్ ఇంజన్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రతి జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలు సృష్టించి.. గతం మాదిరిగా ప్రజల్లో ఒక రకమైన విభజన రేఖ తేవాలని విపక్షం భావిస్తోంది. కానీ వారికి ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు సీఎం చంద్రబాబు.