CM Chandrababu: కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు అవుతోంది. కానీ ఒకే ఒక్క ఎమ్మెల్యే పై వచ్చిన వివాదాలు అన్నీ ఇన్ని కావు. హై కమాండ్ వార్నింగ్ ఇవ్వడం.. సదరు ఎమ్మెల్యే వివరణ ఇచ్చుకోవడం.. అయినా సరే వివాదాలు రావడం పరిపాటిగా మారింది. ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. సదరు ఎమ్మెల్యే తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు( Srinivas Rao ) అని. గత కొంతకాలంగా ఆయన వివాదాస్పదం అవుతూనే ఉన్నారు. ఇటువంటి తరుణంలో కృష్ణా జిల్లాలో పర్యటించారు సీఎం చంద్రబాబు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలకు హాజరయ్యారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులంతా చంద్రబాబుకు స్వాగతం పలికారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వచ్చారు కానీ.. చంద్రబాబు ఆయన విషయంలో వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.
Also Read: పొలిటికల్ జంక్షన్ లో ఆ నేతలు.. చంద్రబాబు భయం అదే!
కొద్ది రోజుల కిందట పార్టీకి అల్టిమేటం ఇచ్చారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. తన నియోజకవర్గంలో టిడిపి నేత రమేష్ రెడ్డిని ( Ramesh Reddy ) పార్టీ నుంచి బహిష్కరించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అందుకు 48 గంటల పాటు గడువు కూడా విధించారు. ఈ కామెంట్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. పార్టీ హై కమాండ్ ఆగ్రహానికి కారణమయ్యాయి. దీంతో రకరకాల ప్రచారం నడిచింది. పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తుందని ఒకవైపు.. ఆయన వైయస్సార్ కాంగ్రెస్ టచ్లోకి వెళ్లారని మరోవైపు తెగ ప్రచారం జరిగింది. తరువాత ఆ వివాదం సద్దుమణిగింది. దీనిపై ఎమ్మెల్యే శ్రీనివాస్ రావు సైతం మాట్లాడలేదు. పార్టీ హై కమాండ్ నుంచి సైతం ఎటువంటి ఆదేశాలు రాలేదు.
* అనూహ్యంగా ఎమ్మెల్యే..
తిరువూరుకు అనూహ్యంగా ఎమ్మెల్యే అయ్యారు కొలికపూడి శ్రీనివాసరావు. అమరావతి( Amravati ) ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చారు శ్రీనివాసరావు. ఓ ట్రైనింగ్ అకాడమీ నడుపుతూ అమరావతి ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. మంచి వక్త కావడంతో టీవీ డిబేట్లకు హాజరయ్యేవారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థించే వారు. అలా తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో తిరువూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఛాన్స్ దక్కించుకున్నారు. కూటమి ప్రభంజనంలో ఎమ్మెల్యేగా గెలిచారు.
* తరచూ వివాదాలు
అయితే తిరువూరులో శ్రీనివాసరావు గెలిచిన నాటి నుంచి వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచారో లేదో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party) ప్రజా ప్రతినిధి ఇంటిని ధ్వంసం చేయించారు. ఆక్రమణల పేరిట తొలగించారు. అప్పట్లో ఈ వివాదం పార్టీ హై కమాండ్ వద్దకు చేరింది. పార్టీ పెద్దలు ఆయన దూకుడును నియంత్రించారు. అయితే అప్పటినుంచి సొంత పార్టీ నేతలు, ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది.. ఇలా ప్రతి ఒక్కరు కొలికపూడి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
* హై కమాండ్ సీరియస్
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి తీరుతో పార్టీ హైకమాండ్ విసిగి వేసారి పోయింది. ఒకసారి క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు కూడా. అప్పట్లో జిల్లా టిడిపి ఎంపీలు, ఎమ్మెల్యేలు సముదాయించడంతో పరిస్థితి సద్దుమణిగింది. కానీ ఇటీవల పార్టీ హై కమాండ్ కు అల్టిమేటం ఇవ్వడాన్ని చంద్రబాబు( CM Chandrababu) జీర్ణించుకోలేకపోయారు. అందుకే తాజాగా కృష్ణా జిల్లా పర్యటనలో ఎమ్మెల్యే కొలికపూడిని చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇలా ట్రోల్స్ కు దిగుతుండడం విశేషం.