CM Chandrababu
CM Chandrababu : ఏపీలో( Andhra Pradesh) ఉద్యోగుల విషయంలో చంద్రబాబు సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో ఆయన ఉద్యోగులకు వ్యతిరేకి అని ముద్ర సొంతం చేసుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి అలా వ్యవహరించడంతో ఆ ముద్ర ఆయనకు వెళ్ళిపోయింది. మొన్నటి ఎన్నికల్లో ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపించారు. చంద్రబాబు పట్ల సానుకూలత లేకపోయినా.. జగన్మోహన్ రెడ్డి పై ఉన్న వ్యతిరేకతతో కూటమికి జై కొట్టారు. అయితే అదే ఉద్యోగుల మద్దతును పొందాలని చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. గత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దక్కకుండా పోయిన సర్కారీ నిధులను విడుదల చేస్తూ వారి అభిమానాన్ని పొందుతున్నారు. ఉద్యోగులకు వివిధ పద్ధుల్లో బకాయి పడ్డ నిధులను విడుదల చేశారు. ఇప్పుడు ఈ నిధులు ఉద్యోగుల ఖాతాల్లో పడుతున్నాయి. దీంతో ఆయా వర్గాల్లో సంతృప్తి కనిపిస్తోంది.
Also Read : పవన్ కి పెద్ద తలనొప్పిగా మారిన నాగబాబు..టీడీపీ, వైసీపీ ఏకం అయ్యాయిగా!
* ఐదేళ్లలో ఇబ్బందులు
గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డారు ఉద్యోగులు. ఉపాధ్యాయులకు సైతం ఇబ్బందులు తప్పలేదు. సరిగ్గా వేతనాలు కూడా చెల్లించిన దాఖలాలు లేవు. ఒకానొక దశలో మూడో వారం దాటినా వేతనాలు అంది పరిస్థితి లేదు. పైగా వారి విషయంలో ఎడతెగని నిర్లక్ష్యం చేశారు జగన్మోహన్ రెడ్డి. దాని పర్యవసానాలు మొన్నటి ఎన్నికల్లో స్పష్టంగా చవిచూశారు. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకున్న చంద్రబాబు ఉద్యోగుల విషయంలో మాత్రం ఎటువంటి జాప్యం చేయడం లేదు. త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో వారి అభిమానాన్ని పొందుతున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అభినందనలు అందుకుంటున్నారు.
* చాలావరకు పెండింగ్
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సిపిఎస్( CPS), జిపిఎఫ్, ఏపీ జిఏఐ నిధులను విడుదల చేయలేదు. ఫలితంగా ఈ పొద్దుల్లో ఉద్యోగులకు ప్రభుత్వం భారీ ఎత్తున బకాయి పడింది. వైయస్సార్ కాంగ్రెస్ అధికారం దిగిపోయే నాటికి ఈ బకాయిలు ఏకంగా 7000 కోట్లకు దాటిపోయాయి. అయితే అప్పట్లో ప్రభుత్వం వివిధ రూపాల్లో బెదిరించేది. దీంతో ఉద్యోగులు కూడా ప్రశ్నించేందుకు వెనుకడుగు వేసేవారు. అయితే ఏపీలో అధికారం మారింది. సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేసిన తర్వాత ఉద్యోగులు ఆయన వద్దకు వెళ్లి సమస్యలను ఏకరువు పెట్టారు.
* గత అనుభవాల దృష్ట్యా
అయితే ఉద్యోగుల( employees) విషయంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు వడివడిగా నిర్ణయాలు తీసుకున్నారు. సంక్రాంతి సందర్భంగా ఉద్యోగుల బకాయిల్లో రూ. 1033 ఓట్లను చెల్లించి ఉద్యోగుల కష్టాలను కొంతవరకు తీర్చగలిగారు. తాజాగా మరో రూ. 6,200 కోట్లు విడుదల చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు శుక్రవారం ఈ నిధులు విడుదలయ్యాయి. బుధవారం లోగా ప్రతి ఉద్యోగి ఖాతాల్లో జమ కానున్నాయి. మొత్తానికైతే చంద్రబాబు ఇచ్చిన హామీను నిలబెట్టుకున్నారన్నమాట.
Also Read : టీటీడీలో కీలక నిర్ణయాలు.. వార్షిక బడ్జెట్.. కొత్త రూల్స్ ఇవే!