AP DSC
AP DSC: ఏపీలో( Andhra Pradesh) నిరుద్యోగులకు గుడ్ న్యూస్. వేసవిలో చల్లని వార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి రంగం సిద్ధం అవుతోంది. ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు అన్ని జిల్లాల యంత్రాంగాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం కలెక్టర్ల సదస్సులో కీలక ప్రకటన చేశారు. దాదాపు 16 వేల పోస్టులకు పైగా భర్తీకి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి కావాలన్నది చంద్రబాబు ఆదేశాలు. కలెక్టర్ల సదస్సులోనే సీఎం చంద్రబాబు ఫుల్ క్లారిటీ ఇవ్వడంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఏపీ బీజేపీకి పదవి.. ఆ ముగ్గురిలో ఎవరికి?
* గత ఐదేళ్లలో నో డీఎస్సీ
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా డీఎస్సీ నియామకం జరగలేదు. సరిగ్గా ఎన్నికల కు ముందు 6000 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఇంతలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఈ నియామక ప్రక్రియ నిలిచిపోయింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీకి తగ్గట్టుగానే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం ఆ ఫైల్ పైనే చేశారు. 6000 పోస్టులకు అదనంగా మరో 10 వేలకు పైగా పోస్టులను జత కలిపి డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. ముందుగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ను సైతం నిర్వహించారు. అయితే ఇంతలో ఎస్సీ వర్గీకరణ అంశం తెరపైకి రావడంతో ఆ వర్గాల నుంచి వినతులు వచ్చాయి. అయితే తాజాగా ఎస్సీ వర్గీకరణ ఈ 2026 తర్వాత జరుగుతుందని క్లారిటీ వచ్చింది. అందుకే డీఎస్సీ ప్రకటనకు ప్రభుత్వం సిద్ధపడుతోంది.
* కలెక్టర్ల సదస్సులో క్లారిటీ
తాజాగా కలెక్టర్ల సదస్సులో( collectors meeting ) చంద్రబాబు దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ మొదటి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. ఇటీవలే ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్ ప్రకారం ఎస్సీ వర్గీకరణ ఆధారంగానే.. డీఎస్సీ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలు ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగానే నియామకాలు చేపడతామని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తవుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
* వాయిదా అందుకే
వాస్తవానికి మార్చి నెలాఖరులో డీఎస్సీ నోటిఫికేషన్( DSC notification ) జారీకి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వివిధ వర్గాల నుంచి అందిన వినతులు, అదే సమయంలో వర్గీకరణ పై నియమించిన కమిటీ నివేదిక అందజేత, అసెంబ్లీలో వర్గీకరణకు అనుకూలంగా ఆర్డినెన్స్ జారీ వంటి వరుస పరిణామాలు కారణంగా.. డీఎస్సీ నోటిఫికేషన్ జారీ ప్రక్రియ ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా పడింది. అయినా సరే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు చేపడతామని సీఎం ప్రకటించడం మాత్రం.. నిరుద్యోగులకు కొంతవరకు ఉపశమనమే.