CM Chandrababu : చంద్రబాబు( Chandrababu) దూకుడుగా ఉన్నారు. దూకుడు మీద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకవైపు పాలనను పరుగులు ఎక్కిస్తూనే మరోవైపు అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఇంకోవైపు సంక్షేమ పథకాలు అమలు చేయాలని భావిస్తున్నారు. ఏకకాలంలో ఈ పనులన్నీ పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణ పనులను శరవేగంగా జరిపించాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ఇంకోవైపు పోలవరం ప్రాజెక్టు పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌తో పాటు మంత్రి లోకేష్ కు ఆయన కొన్ని రకాల బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. వీలైనంతవరకూ రాజకీయ అంశాలకు సంబంధించి ఆ ఇద్దరు నేతలకు బాధ్యతలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read : పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలపై చంద్రబాబు రియాక్షన్ వైరల్!
* ముగిసిన హనీమూన్ పీరియడ్
కూటమి ప్రభుత్వానికి( Alliance government ) హనీమూన్ ముగిసింది. ఇప్పటికే అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తోంది. అందుకే ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు పాలనను అందించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా ప్రజలకు మరింత చేరువు కావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో మే నెల నుంచి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. నిధుల సమీకరణతో పాటు కేంద్రంతో సమన్వయానికి చంద్రబాబు విలువైన సమయాన్ని కేటాయిస్తారని తెలుస్తోంది.
* ప్రజల్లోకి బలంగా వైఎస్సార్ కాంగ్రెస్
మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress )పార్టీ ప్రజల్లోకి బలంగా వచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. రాజకీయంగా కూడా కూటమికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ఇంకో వైపు టిడిపి, జనసేన మధ్య విభేదాలు ప్రారంభమైనట్లు కనిపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో చంద్రబాబు పూర్తిస్థాయిలో రాజకీయ అంశాలపై దృష్టి పెట్టె పరిస్థితి లేదు. అందుకే జనసేన నుంచి పవన్, టిడిపి నుంచి లోకేష్ రాజకీయ అంశాలకు సంబంధించి బాధ్యతలు తీసుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఒకటికి రెండుసార్లు పార్టీ శ్రేణులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించుకుందామని.. మరోసారి జగన్మోహన్ రెడ్డికి చాన్స్ ఇస్తే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని కూడా పవన్ హెచ్చరించారు.
* టిడిపిని కట్టడి చేస్తున్న లోకేష్..
అదే సమయంలో లోకేష్( Nara Lokesh ) సైతం టిడిపి శ్రేణులను కట్టడి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి మరో 15 ఏళ్లపాటు కొనసాగాలని చంద్రబాబు బలంగా విశ్వసిస్తున్నారు. దానిని చెప్పే పరిస్థితి ఉండకూడదని లోకేష్ సైతం పార్టీ శ్రేణులను సర్దుబాటు చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది. రెండు పార్టీల మధ్య చిచ్చుపెట్టేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించే అవకాశం ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీ పరంగా ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు లోకేష్ తనవంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికివారుగా తమ పార్టీలను బలోపేతం చేస్తూనే.. సమన్వయంతో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు ఆ ఇద్దరు నేతలకు బాధ్యతలు అప్పగించారు. మరి వారు ఎంతవరకు వర్కౌట్ చేస్తారో చూడాలి.
Also Read : అమరావతికి ప్రధాని మోదీ.. చంద్రబాబు బిగ్ డెసిషన్!