Margadarshi Case : మార్గదర్శి కేసు…రామోజీరావు, శైలజా కిరణ్ లకు మరోసారి సీఐడీ నోటీసులు..

రామోజీరావుతో పాటు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ కు నోటీసులు జారీచేసే పనిలో పడింది. ఉద్దేశపూర్వకంగా సీఐడీ ప్రతిష్ఠను దిగజార్చేలా ఇరువురు వ్యవహరిస్తున్నారని..వారిపై న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సీఐడీ సిద్ధమవుతోంది.

Written By: Dharma, Updated On : June 11, 2023 10:39 am
Follow us on

Margadarshi Case : రాజగురువు రామోజీరావుకు మరో షాక్. ఏపీ సీఐడీ కఠిన చర్యలు దిశగా అడుగులేస్తోంది. ఇప్పటికే మార్గదర్శి చిట్ ఫండ్స్ అవినీతిపై సీఐడీ ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. చైర్మన్ రామోజీరావుతో పాటు ఎండీ శైలజా కిరణ్ పై కేసులు నమోదయ్యాయి. విచారణ సైతం జరుగుతోంది. ఏకంగా రామోజీ ఇంటికి వెళ్లి మరీ సీఐడీ అధికారులు విచారణ జరిపారు. రూ.700 కోట్ల విలువైన ఆస్తులను సైతం అటాచ్ చేశారు. ఆయన కోడలు, ఎండీ శైలజాకిరణ్ ను సైతం ప్రశ్నించారు. మార్గదర్శి వ్యవహారంలో జరిగిన అవినీతిని అణువణువునా బయటకు తీస్తున్నారు. ఈ క్రమంలో ఉక్కిరిబిక్కిరవుతున్న రామోజీ తన అనుకూల మీడియాతో దర్యాప్తు సంస్థ సీఐడీపై దుష్ప్రచారం చేయిస్తున్నారు.

అబద్ధాన్ని నిజం చేయడం.. నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించడం రామోజీరావుకు వెన్నతో పెట్టిన విద్య. తన చేతిలో ఉన్న మీడియాతో ప్రభుత్వాలు, పాలకులతో ఓ ఆట ఆడుకున్నారు. చివరకు నందమూరి తారకరామారావును సైతం క్షమించలేదు. పతనమంచున నిలబెట్టడంలో రామోజీదే యాక్టివ్ రోల్. నేటి సీఎం జగన్ కూడా రామోజీరావు బాధితుడే. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే జగన్ ను అవినీతిపరుడిగా చూపించడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే జగన్ చేతిలో రామోజీ అవినీతిపరుడిగా నిలబడ్డారు. కక్కలేక.. మింగలేక.. కేసు నుంచి బయటపడలేక.. చివరకు అంపశయ్యపై కనిపించారు.

ఇప్పుడు ఏకంగా దర్యాప్తు సంస్థ సీఐడీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా అనుకూల మీడియాలో కథనాలు ప్రచురిస్తున్నారు. దీనిపై సీఐడీ సీరియస్ అవుతోంది. సీరియస్ యాక్షన్ కు దిగుతుంది. రామోజీరావుతో పాటు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ కు నోటీసులు జారీచేసే పనిలో పడింది. ఉద్దేశపూర్వకంగా సీఐడీ ప్రతిష్ఠను దిగజార్చేలా ఇరువురు వ్యవహరిస్తున్నారని..వారిపై న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సీఐడీ సిద్ధమవుతోంది.

ఈ కేసులో బయటపడే మార్గం లేక ఇటువంటి చర్యలకు దిగుతున్నారని భావిస్తోంది. ఇప్పటికే ఈ కేసు విషయంలో రామోజీ చంద్రబాబును ప్రయోగించారన్న వార్తలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న అమిత్ షాను చంద్రబాబు కలిసింది రామోజీరావు కోసమేనని ప్రచారం జరిగింది. ఆ ప్రయోగం విఫలం కావడంతో ఇప్పుడు ఏకంగా సీఐడీని నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారు. దీంతో రాష్ట్ర అత్యున్నత సంస్థ మేల్కొంది. చట్టపరంగా, న్యాయపరంగా రామోజీ చర్యలను అడ్డుకునే ప్రయత్నంలో ఉంది.