Chebrolu Kiran Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేశారు చేబ్రోలు కిరణ్. ఐ టిడిపి కార్యకర్తగా ఉన్న కిరణ్( chebrolu Kiran ) ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి తో పాటు ఆయన భార్య భారతి రెడ్డి, ఇద్దరు పిల్లలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది వివాదంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియా అరెస్టులు జరుపుతున్న కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. ఇటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. చేబ్రోలు కిరణ్ పై టిడిపి హై కమాండ్ వెయిట్ వేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సక్సెస్ అయ్యింది.
Also Read : జగన్ ఫ్యామిలీపై కామెంట్స్.. చేబ్రోలు కిరణ్ ను అరెస్ట్ చేయాలని టీడీపీ ఆదేశాలు
* ఇరుకునపెట్టిన చేబ్రోలు కిరణ్
ఉమ్మడి అనంతపురం( Ananthapuram district) జిల్లా రాప్తాడు లో ఇటీవల పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి స్పందించారు. లింగమయ్య అనే వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్త హత్యతో.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడ మండల పరిషత్ ఎన్నికల్లో ఎస్సై ఏకపక్ష వైఖరిని నిలదీశారు. ఈ క్రమంలో తప్పు చేసిన పోలీసుల బట్టలూడదీసి నిలబెడతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే చేబ్రోలు కిరణ్ ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో జగన్ పై విరుచుకుపడ్డారు. కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విపరీతంగా స్పందించింది. దీంతో తెలుగుదేశం పార్టీ హై కమాండ్ స్పందించాల్సి వచ్చింది. చేబ్రోలు కిరణ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయగా.. ఇదే కేసులో ఆయనను అరెస్టు చేశారు కూడా పోలీసులు.
* డ్యామేజ్ జరగకూడదని..
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సోషల్ మీడియా( social media) అరెస్టులు జరుగుతున్న సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా మాట్లాడారని.. రాజకీయ ప్రత్యర్థులపై, వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చాలామందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాజకీయ విమర్శలు వచ్చినా కూటమి వెనక్కి తగ్గలేదు. అదే సమయంలో టిడిపి సోషల్ మీడియా యాక్టివిస్టులు సైతం చాలా పద్ధతిగా విమర్శలు చేసేవారు. అయితే చేబ్రోలు కిరణ్ ఉన్నఫలంగా ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామంతో డిఫెన్స్ లో పడింది తెలుగుదేశం పార్టీ. కిరణ్ పై చర్యలు తీసుకోకుంటే భారీగా డ్యామేజ్ జరుగుతుందని భావించింది. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దీనిపై వ్యతిరేకంగా ప్రచారం చేసింది. ఇటు తెలుగుదేశం, అటు ప్రభుత్వం ఒకేసారి స్పందించాల్సి వచ్చింది. అయితే ఏపీ పోలీసులు కిరణ్ ను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తరలించారు. కోర్టులో హాజరు పరచనున్నారు. అయితే ఈ ఘటనతో సోషల్ మీడియా యాక్టివిస్టుల్లో ఒక రకమైన భయం ప్రారంభం అయ్యింది.
Also Read : ఇంత దారుణ మాటలా? అసలు మనిషివేనా? ఇలాంటి వాడిని వదలొద్దు