Chandrababu : వాస్తవానికి, తర్కానికి సంబంధం లేకుండా రాజకీయ నాయకులను పొగుడుతూ ఉంటారు. దైవంశ సంభూతులుగా పేర్కొంటూ.. ఆకాశానికి ఎత్తేస్తుంటారు. వాస్తవానికి ఇలాంటివి రాజకీయాలలో సర్వసాధారణమే అయినప్పటికీ.. జోకుడు విషయంలో కొంతమంది పీహెచ్డీ చేస్తారు. తాము ఏం మాట్లాడుతున్నామో.. ఎలా మాట్లాడుతున్నామో ఏ మాత్రం పట్టించుకోరు. పైగా ఎదుటివారి స్పందనను కూడా లెక్కలోకి తీసుకోరు. ఇష్టానుసారంగా మాట్లాడుతారు. ఆ మాటలు విన్న వారికి మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతాయి. మైండ్ కరాబ్ అవుతుంది. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఆ వీడియోలో మాటలు విన్న వాళ్ళకి పొట్ట చెక్కలయ్యేంత నవ్వు ప్రాప్తిస్తోంది.
Also Read : డబ్ల్యూ డబ్ల్యూఈ పోటీలు వేస్టబ్బా.. మన ఆర్టీసీ బస్సులో ఈ మహిళల ఫైట్ బెస్ట్..
ఇంతకీ ఏం జరిగిందంటే..
ఏపీలో చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతున్నారు. ఈ పరిణామం పసుపు సైనికులకు ఆనందం కలిగిస్తోంది. ఐదు సంవత్సరాల విరామం తర్వాత అధికారంలోకి రావడంతో వారి ఆనందానికి అవధులు లేవు. కాకపోతే అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని కార్యకర్తలు అమాంతం పొగిడేస్తుంటారు. నీ అంతటివాడు లేడని కేజిఎఫ్ రేంజ్ లో ఎలివేషన్లు ఇస్తుంటారు. అవి అన్ని సందర్భాల్లో వర్కౌట్ కావు. సందర్భాల్లో బెడిసి కొడుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా విభాగానికి దొరికింది. ఇంకేముంది సోషల్ మీడియాలో వారు ఒక ఆట ఆడుకుంటున్నారు. ఒక భారీ బహిరంగ సభలో పాల్గొనడానికి చంద్రబాబు ఏపీలోని ఓ ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే ఆయన సభా వేదిక మీదకు వచ్చారు. ఈలోగా సభకు అధ్యక్షత వహిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేశారు. ఆయన గొప్ప నాయకుడని.. సమర్థవంతమైన పరిపాలకుడని పేర్కొన్నారు. అంతేకాదు పిడుగుపాటును 45 నిమిషాల ముందే గుర్తించి.. దానిని నిలిపి వేయించారని వ్యాఖ్యానించారు. ఈ మాటలు విన్న వారందరికీ ఒక్కసారిగా షాక్ తగిలినంత పనైంది. అదేంటి పిడుగుపాటును గుర్తించడం వరకు ఓకే.. పిడుగుపాటును నిలిపివేయడం ఏంటని చాలామంది తమలో తామే నవ్వుకుంటున్నారు. ” ఓరయ్యా.. చంద్రబాబు గురించి ఇంకా ఎక్కువ మాట్లాడు. ఇంకా ఎక్కువ పొగుడు. అందులో తప్పులేదు.. కానీ పిడుగుపాటును ముందే గుర్తించడం ఏంటి.. సరే పెరిగిన సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ఆ పని చేశాడు అనుకుందాం. కానీ పిడుగు పాటు కాకుండా నిలిపివేయడం ఏంటని” నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా చంద్రబాబు కు మైలేజీ పెరగడం కాదు.. అనవసరమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు చురకలు అంటిస్తున్నారు.. ఏం మాట్లాడుతున్నారో కార్యకర్తలకు సోయి ఉండాలని.. ఈ సందర్భంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయాలో తెలిసి ఉండాలని హితవు పలుకుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ మళ్ళీ చేస్తే చంద్రబాబుకు ఉన్న గౌరవం కాస్త తగ్గిపోతుందని.. అది నిజమేనా టిడిపి కార్యకర్తల లక్ష్యం కాదని నెటిజన్లు వివరిస్తున్నారు.
ఒరేయ్ ఎవర్రా మీరంతా #jaganannamedia pic.twitter.com/khRNhWkWgD
— JAGANANNAMEDIA (@JAGANANNAMEDIA) May 15, 2025