Chandrababu Super Six: ఏపీలో( Andhra Pradesh ) కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న తరుణంలో సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టింది. కీలకమైన తల్లికి వందనం పథకం కింద ఈరోజు లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయనుంది. మరోవైపు ఇదే నెలలో అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా అభివృద్ధిపై దృష్టి పెట్టింది. అదే సమయంలో పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల ప్రారంభం, మూడు గ్యాస్ సిలిండర్ల ఉచితం వంటి పథకాలను అమలు చేసింది. ఈ నెలలో రెండు పథకాలకు శ్రీకారం చుట్టనుంది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనుంది. తద్వారా సూపర్ సిక్స్ పథకాలను ఇంచుమించు అమలు చేసినట్టు అవుతుంది. ఇప్పుడు దీనిపైనే సీఎం చంద్రబాబు కూటమి పార్టీల శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇకపై విపక్షాలకు సమాధానం ఆ స్థాయిలో చెప్పాలని సూచించారు.
Also Read: Pawan Kalyan Film Celebrities: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్.. 15న సీఎం చంద్రబాబుతో సినీ ప్రముఖుల భేటీ!
ఈ నెలలో రెండు కీలక పథకాలు..
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 67 లక్షల మంది తళ్ళుల ఖాతాల్లో తల్లికి వందనం(Thalliki vandanam) నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో ప్రధానమైనది తల్లికి వందనం పథకం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నగదు అందించే ఏర్పాట్లు చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఇంట్లో ఒక పిల్లాడికి మాత్రమే అమ్మ ఒడి వర్తింపజేసింది. తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు అదే మాదిరిగా పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే వైసిపి మార్గదర్శకాలను ఇప్పుడు కూడా అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ మీడియా ముందుకు వచ్చారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా విపక్షాల విషయంలో కూటమి పార్టీలు ఎదురుదాడికి సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
Also Read: Nandamuri Hero : నా బొచ్చు కూడా పీకలేరు… ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నందమూరి హీరో ఘాటైన వార్నింగ్
ఆ విమర్శలను తిప్పికొట్టండి..
కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్( super sex ) హామీలు అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ముఖ్యంగా కీలకమైన అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకం ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల మొత్తాన్ని పెంచి గత ఏడాదికాలంగా అందిస్తోంది. పైగా మూడు నెలల బకాయితో కలిపి కూడా అందించింది. అటు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 200కు పైగా అన్న క్యాంటీన్లను ప్రారంభించి పేదలకు రోజుకు 15 రూపాయలకు మూడు పూటలా భోజనం అందిస్తోంది. ఇంకోవైపు గత ఏడాది దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తోంది. ఇప్పుడు తాజాగా తల్లికి వందనం తో పాటు అన్నదాత సుఖీభవ అమలు చేస్తోంది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి సంబంధించి కసరత్తు చేస్తోంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగానే ఈ హామీలన్నీ అమలు చేసినట్టు తాజాగా చంద్రబాబు గుర్తు చేస్తున్నారు. ఇకపై ప్రశ్నించడానికి వీలులేదని.. దాదాపు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి చూపించామని చంద్రబాబు చెబుతున్నారు. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలను గట్టిగా తిప్పి కొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ayyipoindii antaa ayyoo thussuuu #tdp #ChandrababuNaidu pic.twitter.com/PalfLkZjfL
— Akanksha Reddy (@Akanksha_4512) June 12, 2025