https://oktelugu.com/

CM Chandrababu: అంతా అవసరార్థమే.. సిబిఐ విచారణను బాబే లేపేసాడు.. ఇప్పుడు బాబే పెట్టించాడు!

గతంలో ఏపీలో ప్రత్యర్థులపై అక్రమ కేసులు నమోదు చేసేందుకు కేంద్రం సిబిఐ ని ప్రయోగిస్తుందని చంద్రబాబు ఆరోపించారు. అందుకే ఏపీలో సిబిఐ ఎంట్రీని నిషేధించారు. ఇప్పుడు అదే చంద్రబాబు సిబిఐ విచారణను ఆహ్వానిస్తూ నిషేధాన్ని ఎత్తివేయడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : August 21, 2024 8:24 am
    CM Chandrababu(9)

    CM Chandrababu(9)

    Follow us on

    CM Chandrababu: ఏపీలో కీలక పరిణామం. రాష్ట్రంలో సీబీఐ ఎంట్రీకి చంద్రబాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో సీబీఐ విచారణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేటు సంస్థలపై రాష్ట్ర అనుమతి లేకుండా విచారణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో విచారణ చేపట్టే ముందు అనుమతి తప్పనిసరి అంటూ నిబంధన పెట్టింది.ఈ ఉత్తర్వులు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సిబిఐ ద్వారా తనకు ఇబ్బందులు ఎదురవుతాయని భావించారు. అందుకే రాష్ట్రంలో సీబీఐ ఎంట్రీ లేకుండా చేశారు. ఎందుకుగాను ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ఆ రాష్ట్రంలో సిబిఐ ఎంట్రీ లేకుండా చేశారు. ఈ క్రమంలోనే ఎన్డీఏను విభేదించడంతో కేంద్రం నుంచి కేసుల రూపంలో వేధింపులు ఉంటాయని చంద్రబాబు భావించారు. అందుకే అప్పట్లో రాష్ట్రంలో సీబీఐ విచారణను నిరాకరించారు. ఇప్పుడు అదే చంద్రబాబు సర్కార్ సిబిఐ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఇది జగన్ కోసం తీసుకున్న నిర్ణయం గా వారు భావిస్తున్నారు.

    * రాజకీయ ప్రత్యర్థులపై
    రాజకీయ ప్రత్యర్థులపై కేంద్రం సిబిఐతో పాటు ఈడీని ప్రయోగిస్తుందన్న విమర్శలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే చాలా రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీల అధినేతలపై కేసులు కొనసాగాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ డిప్యూటీ సీఎం అరెస్టు చేశారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థులను సిబిఐ వెంటాడింది. అందుకే చాలా రాష్ట్రాలు సిబిఐ విచారణను నిషేధించాయి. ఆ జాబితాలో ఏపీ ఉండేది. దాని నుంచి చంద్రబాబు సర్కార్ ఇప్పుడు తప్పించింది.

    *:జగన్ ను ఇరుకున పెట్టేందుకే
    జగన్ ను ఇరుకున పెట్టేందుకే చంద్రబాబు సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. జగన్ పై అక్రమాస్తుల కేసులు ఉన్న సంగతి తెలిసిందే. ఆ కేసుల్లో గత పదేళ్లుగా ఆయన బెయిల్ పై ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఆ కేసులు విచారణకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సిబిఐకి అనుమతిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇది జగన్ కోసం తీసుకున్న నిర్ణయం గా వైసీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి.

    * వరుస దర్యాప్తులు
    ఇప్పటికే రాష్ట్రంలో వైసిపి నేతలపై సిఐడి విచారణలు కొనసాగుతున్నాయి. గతంలో ఇదే సీఐడీని జగన్ ప్రయోగించారు. చంద్రబాబుపై కేసులు నమోదు చేయగలిగారు. దాదాపు 52 రోజులు పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచగలిగారు. అయితే జగన్ పై ఇప్పటికే సిబిఐ కేసులు పెండింగ్లో ఉన్నందున.. మరింత మార్గం సుగమం చేసేందుకు చంద్రబాబు సీబీఐపై నిషేధాన్ని ఎత్తివేశారు. పాత కేసులను తిరగదొడి జగన్ ను ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యంతో చంద్రబాబు ముందుకు సాగుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే ఈ కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణను వద్దనుకున్నారో.. దానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మాత్రం విశేషం.