Rajinikanth And Balakrishna: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ కి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ లవ్వడమే కాకుండా తనకి సూపర్ స్టార్ గా కూడా మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఇక రజనీకాంత్ కెరియర్ లో ఆయన ఎన్నో బ్లాక్ బాస్టర్ సక్సెస్ లను అందుకున్నాడు. ముఖ్యంగా ఆయన ఫ్రెండు అయిన కె ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో చేసిన చాలా సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ముఖ్యంగా వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ముత్తు, నరసింహా లాంటి సినిమాలతో రజనీకాంత్ ఒక సారిగా స్టార్ డమ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే నందమూరి ఫ్యామిలీ రెండోవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ కూడా తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేశాడు. ఇక అందులో భాగంగానే నందమూరి నటసింహంగా ఎదిగిన ఆయన ఇప్పుడు చాలా మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషము…
ఇక ఇదిలా ఉంటే కె ఎస్ రవికుమార్ వీళ్లిద్దరిని పెట్టి ఒక భారీ మల్టీస్టారర్ సినిమాని తెరకెక్కించాలనే ప్రయత్నం చేశాడు. 2000 సంవత్సరంలో ఈ సినిమాకి సంబంధించిన పూర్తి స్టోరీని రెడీ చేసి అటు బాలయ్యకి, ఇటు రజనీకాంత్ కి వినిపించాడు ఇంకా ఈ సినిమాకి రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ బాలయ్యకు మాత్రం ఆ కథ అంత పెద్దగా నచ్చలేదు.
దాంతో కొద్దిరోజుల పాటు ఆ కథని హోల్డ్ లో పెట్టి ఆ తర్వాత తను ఆ సినిమా చేయలేనని చెప్పాడు. ఇక దానికి కారణం ఏంటి అంటే ఆ సినిమాలో బాలయ్య బాబు క్యారెక్టర్ కొన్ని చోట్ల తగ్గి ప్రవర్తించాల్సిన అవసరమైతే ఉంటుందట. ఇక అప్పటికే ‘సమరసింహారెడ్డి ‘ లాంటి భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందుకున్న బాలయ్య తన అభిమానులను అలరించడానికి అంతకు మించి పాత్ర చేయాలనుకున్నాడు. ఎందుకంటే అప్పట్లో హీరోల అభిమానులు వాళ్ళ హీరో ఎక్కడ తగ్గినా కూడా ఒప్పుకునే వారు కాదు. కాబట్టి సమరసింహారెడ్డి మేనియా పోకుండా ఉండాలి అంటే ఈ సినిమాని చేయకూడదనే ఉద్దేశ్యం తో ఈ భారీ మల్టీ స్టారర్ సినిమాను తను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఇక ఆ తర్వాత కూడా కే ఎస్ రవికుమార్ ఆ పాత్రలో వేరే వారిని ఊహించుకోలేక ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశాడు… ఇక మొత్తానికైతే కె ఎస్ రవికుమార్ లాంటి డైరెక్టర్ కి బాలయ్య బాబు చివర్లో ఇచ్చిన ట్విస్ట్ తో అందరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందనే చెప్పాలి. బాలయ్య బాబు పేరు చెబితే ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నీ బ్రేక్ అవుతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. సీనియర్ హీరోలుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న బాలయ్య తన ఎంటైర్ కెరియర్ ఒక 3 సార్లు ఇండస్ట్రీ హిట్ కొట్టాడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…