MP Mithun Reddy
MP Mithun Reddy : ఏపీలో( Andhra Pradesh) మద్యం కుంభకోణం మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం చెబుతోంది. దీనిపై లోక్సభలో మాట్లాడారు టిడిపి పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు. 90 వేల కోట్ల రూపాయల వ్యాపారాలు జరిగాయని.. 18 వేల కోట్ల దోపిడీ జరిగిందని.. నాలుగు వేల కోట్ల రూపాయలు హవాలా రూపంలో దేశం దాటించేసారని సంచలన ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కీలక ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ప్రధానంగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పైనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో మిధున్ రెడ్డి అరెస్ట్ జరుగుతుందని ప్రచారం సాగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే మిధున్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన చేసిన అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంది హైకోర్టు.
Also Read : రేయ్ కూర్చోరా.. రామ్మోహన్ నాయుడు పై రెచ్చిపోయిన మిధున్ రెడ్డి
* ముందుగా సిఐడి విచారణ..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగినట్టు భావించింది కూటమి ప్రభుత్వం. అందుకే విచారణకు సిఐడిని ఆదేశించింది. ఈ తరుణంలో నాలుగు వేల కోట్ల మేర మద్యం కుంభకోణానికి పాల్పడినట్లు సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో నిదున్ రెడ్డి తో పాటు మరో వైసీపీ ఎంపీ పాత్ర ఉన్నట్లు తెలిపింది. దీంతో మిథున్ రెడ్డి అరెస్టుకు సిఐడి ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సిఐడి కూడా కౌంటర్ దాఖలు చేసింది. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు మిథున్ రెడ్డికి తాత్కాలిక ఊరట ఇచ్చింది.
* కేంద్రం దృష్టికి కుంభకోణం..
ఒకవైపు లోక్ సభలో( Loksabha ) మద్యం కుంభకోణాన్ని లేవనెత్తడం.. అదే సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కలవడం.. ఇలా వరుస పరిణామాలతో మిధున్ రెడ్డిలో ఆందోళన ప్రారంభం అయింది. తప్పకుండా తన అరెస్టు ఉంటుందని ఒక అభిప్రాయానికి వచ్చిన మిథున్ రెడ్డి హైకోర్టు తలుపు తట్టారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఏప్రిల్ 3 వరకు మిథున్ రెడ్డి పై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు. ఈ విచారణను వాయిదా వేసింది.
* ఇప్పటికే అరెస్టుల పర్వం
ఏపీ సిఐడి( Andhra Pradesh CID) నమోదు చేసిన కేసులో అప్పటి ఏపీ బేవరేజెస్ ఎండి వాసుదేవరెడ్డి అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయనపై కొన్ని రకాల ఒత్తిళ్ళు పెంచారని.. కొంతమంది పేర్లు చెప్పాలని సూచించారని ప్రచారం సాగుతోంది. అయితే మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన డబ్బు అంతిమంగా ఎవరికి చేరిందనే విషయాన్ని సిఐడి విచారణలో తేలాల్సి ఉంది. అది తెలుసుకోవాలంటే మిథున్ రెడ్డి ని అదుపులోకి తీసుకోవాలని సిఐడి భావించింది. ఆ ప్రయత్నానికి బ్రేక్ వేసింది హైకోర్టు. అయితే కూటమి ప్రభుత్వం మద్యం కుంభకోణం విషయంలో సీరియస్ గా ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఇది ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Also Read : పెద్దిరెడ్డికి షాక్.. అరెస్టుకు లైన్ క్లియర్!